HIT 3 మూవీ పై హీరో నాని స్పందన

Nani Opens Up About HIT 3 Movie

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని ప్రస్తుతం వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NANI 30 మూవీ లో నటిస్తున్నారు.ఈ మూవీలో సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్ కథానాయిక. క్రైం థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కి బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రాల్లో ఒకటి హిట్‌ సినిమా. ఈ సినిమాతో శైలేష్‌ కొలను టాలీవుడ్ కు డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈ ప్రాజెక్ట్‌ ప్రాంచైజీగా అడివిశేష్‌ హీరోగా తెరకెక్కిన హిట్‌ 2 కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సారి న్యాచురల్‌ స్టార్ నాని తో హిట్‌ 3 ఉండబోతుందని దర్శకుడు శైలేష్ కొలను ప్రకటించినవిషయం తెలిసిందే. హిట్‌ 3 మూవీ గురించి ఓ చిట్‌చాట్‌లోనాని మాట్లాడుతూ.. హిట్‌ 3కి సమయం పడుతుందనీ , హిట్‌ 3 మొదలవడానికి కనీసం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చుననీ , తాను కొన్ని సినిమాలు చేయాల్సి ఉందనీ , శైలేష్ కు కూడా పలు ప్రాజెక్ట్‌లున్నాయనీ , ఖచ్చితంగా హిట్ 3సినిమా సెట్స్‌పైకి వెళ్తుందనీ , కానీ కొంత సమయం పడుతుందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =