కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

శకుంతల పాత్ర పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Samantha Interesting Comments About Shaakuntala Character

శకుంతల పాత్ర పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Samantha Interesting Comments About Shaakuntala Character

Samantha Interesting Comments About Shaakuntala Character

గుణ టీమ్ వర్క్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ ఈ మూవీ లో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ను సమంత ప్రారంభించిన విషయం తెలిసిందే.

ముంబై లో జరిగిన శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో స్టార్ హెరాయిన్ సమంత మాట్లాడుతూ .. తన కెరీర్ లో చేసిన బెస్ట్ పాత్రల్లో ఒకటిగా శకుంతల పాత్ర నిలిచిపోతుందనీ , ఇటువంటి గొప్ప పాత్ర చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందనీ , తప్పకుండా శాకుంతలం రిలీజ్ తరువాత అందరూ గర్వపడతారనీ , దర్శకుడు గుణశేఖర్ ఎంతో గొప్ప టాలెంట్ కలిగిన వ్యక్తి అనీ , అలానే ఇంత మంచి టీమ్ తో వర్క్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం అనీ చెప్పారు. రీసెంట్ గాయశోద మూవీ తో ప్రేక్షకులను అలరించిన సమంత కథానాయికగా తెరకెక్కిన శాకుంతలం మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్