కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 126

megastar chiranjeevi will grace to nithiin and rashmika movie launch
సినిమా వార్తలు

నితిన్-రష్మిక సినిమాకు అతిధిగా మెగాస్టార్

వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఆర్గానిక్ ఫామింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎంటర్ టైనర్ గా నిలిచింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫన్నీ వీడియో ఆకట్టుకుంటుంది. నితిన్, రష్మిక మందన, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ దర్శకుడి కోసం ఎదురు చూస్తారు. వెంకీ కుడుముల వచ్చి లేట్ అయ్యానా? అని అడుగుతాడు.. ముగ్గురు కలసి బాగా..అని చెప్పారు. స్క్రిప్ట్ కూడా బాగా వచ్చిందని చెప్తాడు వెంకీ. ఛలో, భీష్మ లాగా ఈ చిత్రం కూడా వినోదాత్మకంగా ఉంటుందా అని అడిగినప్పుడు.. ఇది వేరేగా ఉంటుందని చెప్పడంతో…

TFN Adminవాట్సాప్
nani and raviteja makes something fun
సినిమా వార్తలు

ధరణితో రావణాసుర సందడి

ఈమధ్య సినిమాల ప్రమోషన్స్ లో క్రియేటివిటీ చూపిస్తున్నారు మేకర్స్. ఎంత విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తే అంత బజ్ క్రియేట్ అవుతుంది. అందుకే మేకర్స్ కొత్త కొత్త ప్రయత్నాలతో వస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలను సైతం వాడేస్తున్నారు. ఈనేపథ్యంలో మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా దసరా కూడా ప్రమోషన్స్ తో బిజీగా గా ఉంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ లో నాని, కీర్తి సురేష్, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో ఆ రేంజ్ లోనే ప్రమోషన్స్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Nayanthara To Team Up With Kamal Haasan
సినిమా వార్తలు

కమల్ హాసన్ స్వంత బ్యానర్ మూవీ లో నయనతార ?

తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ జవాన్ లో కథానాయికగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 3న వరల్డ్ వైడ్ గా, పాన్ ఇండియా రేంజ్ లోనూ రిలీజ్ కానుంది.ఇరైవన్ తమిళ మూవీ లో నయనతార కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Sreeleela Superb Words About Balakrishna
సినిమా వార్తలు

హీరో బాలకృష్ణ గారికి వీరాభిమానిని - శ్రీలీల

అఖండ, వీర సింహారెడ్డి వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో దూసుకుపోతోన్న నందమూరి బాలకృష్ణ #NBK 108 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా , శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ లో శరత్ కుమార్, బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #NBK108 మూవీ లో బాలయ్య మూడు వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం .

Team TFNవాట్సాప్
rangamarthanda movie gets super response
సినిమా వార్తలు

రంగమార్తాండ కు పాజిటివ్ రెస్పాన్స్

ప్రతి శుక్రవారం, ప్రతి పండక్కి ఇలా పలు స్పెషల్ అకేషన్స్ కు బాక్సాఫీస్ వద్ద సినిమాలు సందడి చేస్తూనే ఉన్నాయి. ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయి.. ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేయడమే కాకుండా మంచి మెసేజ్ ను కూడా ఇస్తుంటాయి. ఈ కోవలోకే వస్తుంది తాజాగా వచ్చిన రంగమార్తాండ సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

TFN Adminవాట్సాప్
Das Ka Dhamki Movie Day 1 Collections
బాక్సాఫీస్

దాస్ కా ధమ్కీ ఫస్ట్ డే కలెక్షన్స్..

ట్యాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొట్టింది. నిన్న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 8.88కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ మూవీ గా నిలిచింది. ఉగాది సందర్భంగా నిన్న సెలవు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాకు చాలా చోట్ల హోస్ ఫుల్ కలెక్షన్స్ పడ్డాయి. ఇక ఈచిత్రం 4కోట్లకు పైగా షేర్ ను తెచ్చుకోవడంతో తొలిరోజే బ్రేక్ ఈవెన్ లో సగానికి పైగా కలెక్ట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Virupaksha Ugadi Special Poster Out Now
ఫస్ట్ లుక్

విరూపాక్ష మూవీ ఉగాది స్పెషల్ పోస్టర్

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై కార్తీక్‌ దండు దర్శకత్వంలో సాయి తేజ్, సంయుక్త జంటగా తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21 వ తేదీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.ఈ మూవీ లో బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ మూవీకి క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథను అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Miss Shetty Mr Polishetty Movie First Single Out Now
సినిమా వార్తలు

రిలీజ్ అయిన అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫస్ట్ సింగిల్

యువి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు దర్శకత్వంలో అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో సమ్మర్ కు రిలీజ్ కానుంది. మహిళా దినోత్సవ సందర్భంగా ఈ సినిమా యూనిట్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ అనుష్క పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో అనుష్క శెట్టి హ్యాండ్ బ్యాగ్ తో విదేశాల్లో నడుస్తూ వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. కొంత గ్యాప్ తరువాత అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
director anil ravipudi about nbk108 first look response
ఫస్ట్ లుక్

NBK 108- ఇది శాంపిల్ మాత్రమే

నందమూరి బాలకృష్ణ ఒక సినిమా తరువాత మరో సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు బాలయ్య. ఇక ఇప్పుడు అదే జోష్ తో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కోసం అనిల్ కూడా బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టు ఒక సాలిడ్ కథతోనే వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న కాజల్, ఇంకా శ్రీలలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Keerthy Suresh Gave Costly Gift To Dasara Staff
సినిమా వార్తలు

దసరా సిబ్బందికి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన కీర్తి సురేష్

నాని ,కీర్తి సురేష్ జంటగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ దసరా విడుదలకు సిద్దమవుతుంది.అందులో భాగంగా ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా వున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో ఒక్క తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ ,దసరా కు పనిచేసిన సిబ్బందికి గోల్డ్ కాయిన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. దాదాపు 130మందికి గాను కీర్తి ,ఒక్కొక్కరికి 10గ్రాముల గోల్డ్ కాయిన్ ను గిఫ్ట్ గా ఇచ్చిందని సమాచారం. వీటి మొత్తం విలువ సుమారు 70నుండి 75 లక్షల వరకు వుంటుందట. షూటింగ్ లో తనకు సహకరించిన సిబ్బందికి ఏదోకటి ఇవ్వాలని భావించిన కీర్తి,గోల్డ్ కాయిన్స్ ను బహుమానంగా ఇచ్చిందట.

Mahender Reddyవాట్సాప్
Dasara Ugadi Special Poster Revealed
ఫస్ట్ లుక్

దసరా మూవీ ఉగాది స్పెషల్ పోస్టర్

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.

Team TFNవాట్సాప్
crazy update on kantara 2 movie
సినిమా వార్తలు

కాంతార 2 క్రేజీ అప్ డేట్ - రైటింగ్ మొదలు

ఈమధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మరో సినిమా కాంతార. రిషబ్ శెట్టి దర్శకత్వంలో చాలా సహజంగా అడవి, అడవిలోని మనుషుల జీవనం, వారి సెంటిమెంట్‌, దైవం, అమాయకజనాన్ని మోసం చేయడం అనే అంశాలపై ఈసినిమాను తెరకెక్కింది. అయితే ఈసినిమా కన్నడలో ఎలాంటి అంచనాలు లేకుండానే బాక్సాఫీస్ బరిలో దిగింది. కానీ అక్కడ ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. ఇక ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఊహించని రీతిలో క్రేజ్ ను సొంతం చేసుకుంది. మరింత క్రేజ్ పెరిగడంతో హిందీలో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈసినిమా సూపర్ హిట్ అయి సాలిడ్ కలెక్షన్స్ అందించింది. ఇక ఐక్యరాజ్యసమితిలో కూడా ఈసినిమాను ప్రదర్శించనున్నారు.

TFN Adminవాట్సాప్
RRR Movie Stunning Collections at Japan
బాక్సాఫీస్

జపాన్ లో భారీ కలెక్షన్స్ తో ఆర్ ఆర్ ఆర్ మూవీ విజయ విహారం

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్…

Team TFNవాట్సాప్
Bholaa Shankar Movie Release Date Revealed
రిలీజ్ అప్‌డేట్

భోళా శంకర్ మూవీ రిలీజ్ డేట్

వాల్తేరు వీరయ్య మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీ రీమేక్ భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ , క్రియేటివ్ కమర్షియల్స్‌ బ్యానర్స్ పై స్టైలిష్ మూవీ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, తమన్నా జంటగా యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహానటి కీర్తి సురేష్, చిరంజీవి సోదరిగా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య…

Team TFNవాట్సాప్
nbk 108 first look poster out
ఫస్ట్ లుక్

NBK 108 ఫస్ట్ లుక్ రిలీజ్

నేడు ఉగాది పండుగ సందర్భంగా కొత్త సినిమాల నుండి వరుస అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే బాలకృష్ణ 108 సినిమా నుండి కూడా సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 108 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమాలో నటిస్తున్న కీలకనటులకు సంబంధించిన పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమాలో నటిస్తున్న శ్రీలీల, కాజల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇక నేడు ఉగాది పండుగ సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
natural star nani about his story selection
సినిమా వార్తలు

నేను ఇంకా 73 కథలు వినాలి

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సినిమా దసరా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రఫ్ అండ్ రస్టిక్ లుక్ తో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాతో నాని అలరించడానికి వస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పెంచిన క్యూరియాసిటీని ఇప్పటివరకూ ఎక్కడా తగ్గించలేదు. వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచాయి తప్పా.. తగ్గించలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

TFN Adminవాట్సాప్
allu arjun surprised with his daughter arhas yoga practice
సినిమా వార్తలు

అర్హ యోగా స్టంట్- బన్నీ హ్యాపీ

అల్లు అర్జున్ సినిమాలు, షూటింగ్ లు పక్కన పెడితే మంచి ఫ్యామిలీ మ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఖాళీ సమయాల్లో పిల్లలు అర్హ, అయాన్ లతో టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. వారిలో అర్హ చేసే అల్లరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అర్హకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తన వీడియోలతో ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది అర్హ. ఇక ఇప్పుడు అటు బన్నీ తో పాటు ఇటు అందరికీ షాకిచ్చింది అర్హ. తాజాగా స్నేహారెడ్డి అల్లు అర్హకు సంబంధించి మరో ఫొటోను పోస్ట్ చేసింది. ఇక ఫొటో అల్లు అర్హ యోగా చేస్తున్న ఫొటో. తన అరికాళ్ళని తన తలకి టచ్ చేస్తున్న యోగా ముద్రను అర్హ వేస్తుండగా.. ఇక బన్నీ హ్యాపీగా చూస్తూ…

TFN Adminవాట్సాప్
Faria Abdullah About Ravanasura Movie Working Experience
సినిమా వార్తలు

రావణాసుర నెక్స్ట్ లెవల్ ఎక్స్ పీరియన్స్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌ పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా 'రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రంలోని హీరోయిన్స్ లో ఒకరైన ఫరియా అబ్దుల్లా విలేఖరుల సమావేశంలో రావణాసుర విశేషాలని పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Tesla Cars Light Show For Naatu Naatu Songs
సాంగ్

న్యూ జెర్సీ లో నాటు నాటు సాంగ్ కు టెస్లా కార్ల లైట్ షో

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్ గెలుచుకుంది.

Team TFNవాట్సాప్
Prakasha Raj Look From Shaakuntalam Revealed
ఫస్ట్ లుక్

రిలీజ్ అయిన శాకుంతలం మూవీ ప్రకాష్ రాజ్ ఫస్ట్ లుక్

గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ ఈ మూవీ లో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ను సమంత ప్రారంభించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్

షేర్