నాకు ఆ సబ్జెక్ట్ అంటే చాలా భయం

iam scared of that subject says talented hero adivi sesh

వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. నటుడిగానే కాదు అటు రచయితగా కూడా తన టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అందుకే వరుసగా హిట్లను అందుకుంటు కెరీర్ లో దూసుకుపోతున్నాడు. గత ఏడాది మేజర్, హిట్ 2 అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అడివి శేష్. రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక హీరోగా, రచయితగా సక్సెస్ అయిన అడివి శేష్ తనకు మ్యాథ్స్ అంటే భయం అంటున్నాడు. తాజాగా ఆయన ఓ స్కూల్ యాప్ ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలుగు పిల్లలకు కావాల్సిన రితీలో విద్య అందించేందుకు యాప్‌ను అందుబాటులోకి తీసుకరావడం చాలా ఆనందంగా ఉందన్నారు. నిజానికి తనకు సైన్స్‌ సబ్జక్ట్ అంటే ఎంత ఇష్టమో గణితం అంటే అంత భయమని తెలిపారు. చదవడం ఎంత ముఖ్యమో చదవి అంశాన్ని గుర్తు పెట్టుకోవడం అంతే ముఖ్యమని.. పరీక్షల సయమంలో తీవ్ర ఒత్తిడికి గురి కాకుండా సులభమైన పద్ధతితో నేర్చుకోని గుర్తు పెట్టుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

కాగా ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి2 సినిమా తో బిజీగా ఉన్నాడు. ఈసినిమా గూఢచారి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. మేజర్ ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీచరణ్ మ్యూజిక్ అందిస్తారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + eight =