పవన్-సాయి తేజ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Pawan Kalyan And Sai Dharam Tej Movie Release Date Announced

మెగా కాంపౌండ్ నుండి ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న క్రేజీ కాంబినేషన్స్ లో పవన్ కళ్యాణ్ -సాయి దరమ్ తేజ్ ది కూడా ఒకటి. ఫైనల్ గా ఈ కాంబినేషన్ నుండి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో పవన్-సాయి తేజ్ ప్రధాన పాత్రల్లో వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళ్ సముద్రఖని ఈసినిమాలో నటించి, దర్శకత్వంలో వహించాడు. ఇప్పుడు తెలుగు రీమేక్ కు కూడా ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈమధ్యనే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు షూటింగ్ కూడా మొదలుపెట్టారు. పవన్ కూడా కొంత వరకూ తన పోర్షన్స్ ను కంప్లీట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఈసినిమా నుండి ఇప్పటివరకూ ఫస్ట్ లుక్ అప్ డేట్ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ అప్ డేట్ ఇవ్వడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈసినిమాను జులై 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ముందు ముందు మరిన్ని అప్ డేట్స్ ఉన్నట్టు తెలియచేశారు.

ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + five =