పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అటు పాలిటిక్స్ ను.. ఇటు సినిమాలను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు. రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా వరుసగా పలు సినిమాలను మాత్రం లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, సముద్రఖనితో సినిమా ఇంకా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉన్నాయి. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సెట్స్ పైకి తీసుకెళుతూ.. టైమ్ ఉన్నప్పుడు ఆసినిమాలు కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు పవన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో హిస్టారికల్ బ్యాగ్రౌండ్ తో తెరకెక్కుతోన్నహరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాదే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే సముద్రఖని సినిమా షూటింగ్ ను కొంత వరకూ పూర్తి చేశాడు. మిగిలిన పోర్షన్ ఏప్రిల్ లో పూర్తి చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ ఏప్రిల్ మొత్తం పవన్ చాలా బిజీగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. తన కొత్త సినిమాలకు పవన్ డేట్లు ఈనెలలో డేట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనితో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా వచ్చే నెలలోనే మొదలుపెట్టనున్నాడట. ఉస్తాద్ భగత్ సింగ్ కు దాదాపు 10 రోజులు కేటాయించినట్టు తెలుస్తోంది. మరోవైపు సుజిత్ దర్శకత్వంలో చేయబోతున్న ఓజీ షూటింగ్ కూడా వచ్చే నెలలోనే షురూ చేయబోతున్నాడట. ఇక పవన్ ఫుల్ బిజీ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి చూద్దాం ఈ ఏడాది పవన్ నుండి ఒక సినిమా వస్తుందో రెండు సినిమాలు వస్తాయో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: