ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్ కు బొమ్మ డ్యాన్స్

Anand Mahindra Shares Puppet Dance Video On Naatu Naatu Song

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్ గెలుచుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. పలువురు ఈ సాంగ్ కు రీల్స్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటి వరకు నాటు నాటు పాటకు జనం స్టెప్పులేయడం చూసుంటారు.. కానీ ఓ బొమ్మ అదిరిపోయే రీతిలో నాటు నాటు స్టెప్పులేసింది. కీలుబొమ్మలాటలో మాదిరిగా చిన్న కర్రలకు దారాలు కట్టిన బొమ్మతో ఓ మహిళ అద్భుతంగా డ్యాన్స్ చేయించారు. కర్రలను కదుపుతూ బొమ్మ చేత నాటు నాటు ఐకానిక్ స్టెప్పును వేయించారు. నిజంగా ఈ వీడియోను చూస్తే ఆమె కళను అభినందించాల్సిందే. బొమ్మ కాళ్లు, చేతులు పాటకు తగినట్లుగా సింక్ చేయిస్తూ అద్భుతంగా స్టెప్పులేయించారు. ఆ వీడియో ను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా లో షేర్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =