రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు చిరంజీవి షాక్

Chiranjeevi Felicitates Brahmanandam for Rangamarthanda Success

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ,రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రంగమార్తాండ. అమ్మానాన్నల కథతో తెరకెక్కిన ఈచిత్రం ఉగాది రోజున విడుదలై పాజిటివ్ రివ్యూస్ మరియు పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రంలో లెజండరీ కమెడియన్, బ్రహ్మనందం కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. చక్రపాణి అనే పాత్రలో బ్రహ్మనందం , ప్రకాష్ రాజ్ కు స్నేహితుడు గా కనిపించగా ఆ పాత్ర ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఇప్పటివరకు కమెడియన్ గా ప్రేక్షకులను నవ్వించిన బ్రహ్మనందం ,రంగమార్తాండలో ఎమోషనల్ పాత్రలో నటించి ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించారు. అయన పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా ఈసినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు ,బ్రహ్మానందాన్నికలిసి తన నటనకు గాను ఆయనను అభినందించారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో బ్రహ్మానందం ఎక్కువ సేపు స్క్రీన్ పై కనబడిన సినిమా కూడా ఇదే.

సూపర్ హిట్ మరాఠి మూవీ నట్ సామ్రాట్ ను మార్పులు చేసి తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేశాడు కృష్ణవంశీ. బ్రహ్మానందంతో పాటు రాహుల్ సిప్లిగంజ్ ,అలీ రెజా ,ఆదర్శ్ బాలకృష్ణ ,అనసూయ , శివాత్మిక రాజశేఖర్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. మధు కాలిపు ,వెంకట్ రెడ్డి సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 6 =