కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఫార్స్ ఫిల్మ్స్ ఎల్ ఎల్ సి కి సలార్ మూవీ ఓవర్సీస్ రైట్స్

Prabhas Salaar Movie Latest Update

ఫార్స్ ఫిల్మ్స్ ఎల్ ఎల్ సి కి సలార్ మూవీ ఓవర్సీస్ రైట్స్

Prabhas Salaar Movie Latest Update

Prabhas Salaar Movie Latest Update

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జ‌గ‌ప‌తిబాబు, ఈశ్వ‌రీరావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సలార్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

తెలుగుతో పాటు క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రిలీజ్ కానున్న సలార్ మూవీ కై దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం . లేటెస్ట్ గా ఈ మూవీ యొక్క ఓవర్సీస్ రైట్స్ ని భారీ ధరకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిలిమ్స్ ఎల్ ఎల్ సి వారు దక్కించుకున్నట్లు , ఇక సలార్ కి మరోవైపు అన్ని ప్రాంతాల నుండి కూడా భారీ స్థాయి బిజినెస్ ఆఫర్స్ వస్తుండగా రాబోయే రోజుల్లో మిగతా ఇతర ప్రాంతాల యొక్క బిజినెస్ డీల్స్ కూడా జరుగనున్నట్లు సమాచారం.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్