న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మరో 6 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ప్రచార చిత్రాల వల్ల ఇప్పటికే ఈసినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని నాని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. సోలో గా రిలీజ్ అవుతుండడం కూడా సినిమాకు కలిసిరానుంది. దాంతో మొదటి రోజు ఈసినిమాతో నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నాని సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ గా వున్నాడు. గత కొన్ని రోజులుగా సినిమాను అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తూ ఇతర భాషల్లో కూడా బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఈవేడుకకు డేట్ ను కూడా ఫిక్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనెల 26న అనంతపూర్ లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈఈవెంట్ జరుగనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ఈవేడుకకు స్టార్ డైరెక్టర్ లు రాజమౌళి , సుకుమార్ లు ముఖ్య అతిధులు గా వస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాల్సివుంది.
Get ready for the DHOOM DHAAM DASARA celebrations 🥁🔥#Dasara Grand Pre-Release Event on 26th March at Arts College Ground, Anantapur 🔥
Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @SLVCinemasOffl @Saregamasouth @shreyasgroup pic.twitter.com/TXmJuSi499
— Vamsi Kaka (@vamsikaka) March 24, 2023
సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈచిత్రంలో నానికి జంటగా కీర్తి సురేష్ నటించగా సాయి కుమార్ , సముద్ర ఖని , దీక్షిత్ శెట్టి , పూర్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకం పై చెరుకూరి సుధాకర్ నిర్మించారు. ఈనెల 30న దసరా తెలుగు తోపాటు తమిళ , మలయాళ ,కన్నడ ,హిందీ భాషల్లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: