ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం అనేది కామన్. ఇక ఇప్పుడు అలాంటి కాంబినేషనే మరోసారి రిపీట్ కాబోతుంది. వెంకీ కుడుముల, నితన్, రష్మిక కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి వీరికాంబినేషన్ లో సినిమా రాబోతుంది. రెండు రోజుల క్రితం నితిన్, రష్మిక, వెంకీ కుడుముల సూపర్ హిట్ కాంబినేషన్ లో రెండవ చిత్రాన్ని చాలా ఫన్నీగా అనౌన్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నేడు గ్రాండ్ గా లాంచ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఇంకా . డైరెక్టర్ బాబీ, గోపీచంద్ మలినేని కూడా అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా మెగాస్టార్ ఫస్ట్ క్లాప్ కొట్టగా బుచ్చిబాబు సాన, హను రాఘవపూడికి స్క్రిప్ట్ ని అందజేశారు. అలాగే గోపీచంద్ మలినేని ఫస్ట్ షాట్ ని డైరెక్ట్ చేశారు.
#VNRTrio movie launched with Megastar @KChiruTweets Garu sounding the clap 🎬
Top directors @dirbobby, @megopichand, @hanurpudi & @BuchiBabuSana graced the grand launch event and wished team the best ❤️@actor_nithiin @iamRashmika @VenkyKudumula @gvprakash pic.twitter.com/QeQksv0ltL
— Mythri Movie Makers (@MythriOfficial) March 24, 2023
కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. మరి భీష్మ చిత్రంతో ఈ ముగ్గురు కలసి మ్యాజిక్ చేశారు.. ఈసారి అదే మ్యాజిక్ చూపిస్తారా లేదా అన్నది చూడాలి
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: