ఎప్పుడూ కమర్షియల్ ఫిలింసే కాదు కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలను కూడా మన ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అందుకు రీసెంట్ వచ్చిన బలగం సినిమా కూడా ఉదాహరణగా చెప్పొచ్చు. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా బలగం. కథా బలం ఉన్న సినిమా బలగం అని చెప్పొచ్చు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, అప్యాయతలను చక్కగా చూపించారు డైరెక్టర్ వేణు. ఎమోషన్స్ ను బాగా చూపించడంతో అందరికీ కనెక్ట్ అయింది. అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈసినిమాను చూసిన వారందరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. సెలబ్రిటీలు సైతం సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభినందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఈసినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమా నేటి నుండి స్ట్రీమింగ్ లోకి వస్తుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూడొచ్చు.
కాగా ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈసినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: