దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించి. ఈ మూవీలో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. భారీ కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.కోటిన్నర ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన బలగం సినిమా అద్భుత కలెక్షన్స్ తో నిర్మాతలకు భారీ లాభాలు అందించింది. తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిన సినిమా కావడంతో నైజాం ఏరియాలోనే బలగం సినిమా భారీ వసూళ్లను సాధిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బలగం సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నేటితో మూడు వారాలు పూర్తి చేసుకుటోంది. తాజాగా ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగు కొత్త సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సరం పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో బలగం చిత్ర యూనిట్ ను ఉగాది నంది సత్కారం తో సత్కరించారు. బలగం చిత్ర నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హర్షిత, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ మరియు ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆర్ నారాయణ మూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు నంది పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
ఉగాది రోజున నా బలగానికి నంది ఒచ్చింది …🤗🤗🤗
మమ్మల్ని సత్కరించి తెలుగు ఉగాది పురస్కారాల నంది మాకు ఇచ్చి గౌరవించిన తెలుగు సినిమా వేదిక వారికి కృతజ్ఞతలు 🙏🙏🙏#balagam #Ugadi #ugadipuraskaralu #telugu #award #venuyeldandi @priyadarshi_i @KavyaKalyanram @DilRajuProdctns pic.twitter.com/fmplw2K7ri— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) March 23, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: