ఫలక్ నుమా దాస్ తరువాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించి డైరెక్ట్ చేసిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఉగాది రోజున విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టి విశ్వక్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను ఇవ్వగా రెండో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. రెండో రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలో 2కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమా అదరగొడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు అక్కడ 200k గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ ను సాధించింది. ఓవరాల్ గా రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 11.90కోట్ల గ్రాస్ ను రాబట్టగా అందులో షేర్ 5.50కోట్లు. మరో 3 కోట్లు వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లే. ఈవీకెండ్ కు మరో సినిమానుండి పోటీ లేకపోవడంతో ధమ్కీ బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకోనుంది. ఇక ఈసినిమా, విశ్వక్ సేన్ కు హిట్ ఇవ్వడమే కాదు అతని మార్కెట్ ను కూడా పెంచింది.
ప్రస్తుతం విశ్వక్ ,సినిమాను మరింతగా ప్రమోట్ చేయడానికి ‘దాస్ కా మాస్ బ్లాక్ బాస్టర్’ పేరుతో సక్సెస్ టూర్ లో పాల్గొంటున్నాడు. ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో విశ్వక్ ద్విపాత్రాభినయం చేశాడు. హోటల్ లో వెయిటర్ గా అలాగే ఫార్మా కంపెనీకి సీఈఓ గా విశ్వక్ నటన ఆకట్టుకుంది. ఈచిత్రంలో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. వీరిద్దరూ కలిసి నటించడం ఇది రెండో సారి. ఇంతకుముందు ఈ కాంబినేషన్ లో ‘పాగల్’ తెరకెక్కింది. ధమ్కీకి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా కరాటే రాజు నిర్మించారు.
A THUNDERING START at the Box Office to the Das Ka Mass Blockbuster 🔥#DasKaDhamki gets an Exceptional 11.90 CR GROSS WORLDWIDE in 2 Days 💥💥💥
ALL TIME HIGHEST for#VISHWAKSEN 😎@VishwakSenActor @Nivetha_Tweets @VanmayeCreation @VScinemas_ pic.twitter.com/qo7bmiJEFU
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 24, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: