కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఏప్రిల్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్ అలానే పలు వీడియోలు రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లిరికల్ ను రిలీజ్ చేశారు. నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే. నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలు చూశాకే సాగే ఈ మెలోడియస్ సాంగ్ ను కార్తీక్ ఆలపించాడు. ఇక పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. ఇక ఈపాట ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Soothing Melody it is ❤️🎶 #NachavuleNachavule Full song from #Virupaksha OUT NOW 👇
– https://t.co/SbhaK0BMBz@IamSaiDharamTej@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESH @NavinNooli @singer_karthik @kk_lyricist @ChoreographerVJ @SVCCofficial @SukumarWritings #VirupakshaOnApril21 pic.twitter.com/45XurNRF44
— SVCC (@SVCCofficial) March 24, 2023
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: