
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 120


ఎన్టీఆర్ 30- సెట్ లోకి అడుగుపెట్టిన యంగ్ టైగర్

దాస్ కా ధమ్కీ 10డేస్ కలెక్షన్స్

ఇండియన్ 2 షూటింగ్ అప్పుడు పూర్తవుతుంది

SSMB28 అప్ డేట్ పై థమన్ క్లారిటీ

మంత్ ఆఫ్ విరూపాక్ష

శాకుంతలంలో మెహన్ బాబు పాత్ర ఇదే

దసరా పై మహేష్ రియాక్షన్- చాలా గర్వంగా ఉంది

ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్

దసరాకు దిగుతున్న NBK108

మెగాస్టార్ పై చంద్రబోస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

షూటింగ్ పూర్తి చేసుకున్న విరూపాక్ష

దసరా సక్సెస్ నాని ఎమోషనల్ పోస్ట్

హరీష్ శంకర్ బర్త్ డే స్పెషల్..

రెండు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న బలగం

దసరా మూవీ టీమ్ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్

దసరా కలెక్షన్స్- దుమ్మురేపుతున్నధరణి
దసరా అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాడు ధరణి. ఎప్పుడూ పక్కింటి అబ్బాయిలా ఉండే పాత్రల్లో కనిపించిన నాని ఈసినిమాతో తనలో ఉన్నఊర మాస్ పాత్రను బయటకు తీసుకొచ్చాడు. గతంలో మాస్ సినిమాలు చేసింది తక్కువ.. చేసినా చాలా తక్కువే చేశాడని చెప్పొచ్చు.. కానీ ఈసినిమాలో మాత్రం రా అండ్ రస్టిక్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా రిలీజ్ కు ముందు ఏర్పడిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో అందరికీ నచ్చేస్తుంది. నాని, కీర్తి సురేష్ ల నటన, శ్రీకాంత్ ఓదెల మేకింగ్, టేకింగ్ లు అందరినీ ఆకట్టుకుంటుండటంతో ఆప్రభావం బాక్సాఫీస్ వద్ద కనిపిస్తుంది.

ఎన్టీఆర్ 30- సెట్ లోకి అడుగుపెట్టిన యంగ్ టైగర్
ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్30 సినిమా గురించి. కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమాన తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో ఎదురుచూస్తుండగా.. రీసెంట్ గానే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఇన్ని రోజులు కొరటాల శివ షూటింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు. ఈనేపథ్యంలోనే ఈసినిమాకు పనిచేస్తున్న హాలీవుడ్ టెక్నీషియన్స్ ను సైతం పరిచయం చేశాడు. ఈసినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను తీసుకున్నారు. ఇక ఇప్పుడు విఎఫ్ఎక్స్ కోసం మరో హాలీవుడ్ టెక్నీషియన్ బ్రాడ్ మిన్నిచ్ తీసుకున్నారు.

దాస్ కా ధమ్కీ 10డేస్ కలెక్షన్స్
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా స్టడీ గా వసూళ్ళను రాబట్టుకుంటుంది. ఉగాది రోజున విడుదలైన ఈ చిత్రం 10రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 11కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 8.50కోట్ల షేర్ ను రాబట్టింది. ఈగురువారం,నాని నటించిన దసరా విడుదలకావడంతో ధమ్కీ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదుర్కొంటుంది. అయితే ధమ్కీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. విశ్వక్ సేన్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.

ఇండియన్ 2 షూటింగ్ అప్పుడు పూర్తవుతుంది
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్.ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకవైపు రామ్ చరణ్ తో సినిమాను పూర్తి చేస్తూనే మరోపక్క ఇండియన్ 2 సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ ఈసినిమా గురించి మాట్లాడుతూ.. ఈసినిమా షూటింగ్ జూన్ వరకూ పూర్తవుతుందని తెలిపాడు. మిగిలిన షూటింగ్ ను తైవాన్ ఇంకా సౌత్ ఆఫ్రికాలో జరగనుందని.. ముందు తైవాన్ లో కొద్దిరోజులు షూటింగ్ ను జరుపుకున్న తరువాత సౌత్ ఆఫ్రికా వెళ్లనున్నారు.. జూన్…

SSMB28 అప్ డేట్ పై థమన్ క్లారిటీ
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూాశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఎప్పటినుండో ఈసినిమా అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు రీసెంట్ గానే ఈసినిమా నుండి మహేష్ లుక్ ను అలానే రిలీజ్ డేట్ ను ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. మాస్ లుక్ లో ఉన్న మహేష్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 13వ తేదీన…

మంత్ ఆఫ్ విరూపాక్ష
మార్చి నెల దసరా లాంటి బ్లాక్ బస్టర్ తో ముగిసింది.ఇక ఇప్పుడు ఏప్రిల్ లో పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది విరూపాక్ష సినిమాకోసం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయింది. టీజర్ సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పెంచేసింది. ఇక ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేశారు. ఇదిలా ఉండగా ఈసినిమా ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో నేడు మంత్…

ఓటీటీ లోకి వచ్చేసిన అమిగోస్
గత ఏడాది బింబిసార సినిమాతో వచ్చి రెండు పాత్రల్లో అలరించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది అమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈసినిమాలో మూడు డిఫరెంట్ పాత్రల్లో అలరించాడు. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన కథాంశంతో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఒక వ్యక్తిని పోలిన వ్యక్తులు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనేది చెప్పడమే కథలోని ప్రధానమైన అంశం.

శాకుంతలంలో మెహన్ బాబు పాత్ర ఇదే
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ,గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలంలో కీలకపాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే మోహన్ బాబు పాత్రేంటి.. ఆయన పాత్ర ఎలా వుండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

షాక్ ఇచ్చిన దసరా సెకండ్ డే కలెక్షన్స్
నాని నటించిన దసరా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తుంది. ఈసినిమా మొదటి రోజు ఏకంగా 38కోట్ల గ్రాస్ వసూళ్లతో నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందించగా రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. రెండో రోజు, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 15కోట్ల గ్రాస్ కు పైగా వసూళ్లను రాబట్టింది. దాంతో మొత్తం రెండు రోజుల్లో 53 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు 5 కోట్ల షేర్ ను రాబట్టడంతో మొత్తం రెండు రోజుల్లో 20కోట్ల షేర్ మార్క్ అందుకుంది. ఇందులో నైజాం నుంచి వచ్చిన షేర్ 10కోట్లు ఉండడం విశేషం. అల్రెడీ నైజాం లో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది.

దసరా పై మహేష్ రియాక్షన్- చాలా గర్వంగా ఉంది
ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చిన సంగతి. ఒకప్పుడు ఒక సినిమా హిట్ అయితే అభిమానులు హడావుడి చేసేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు. ఏదైనా సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నా.. కాస్త డిఫరెంట్ గా ఉన్నా.. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సెలబ్రిటీలు తమ సపోర్ట్ అందించడానికి లేదా ప్రశంసించడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. స్టార్ హీరోలు కూడా అందుకు వెనుకాడట్లేదు. ఇక ఆలాంటి విషయాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎప్పుడూ ముందుటారన్న సంగతి తెలిసిందే. ఏ సినిమా వచ్చినా అభినందనలు చెప్పడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇక ఇప్పుడు దసరా పై కూడా ప్రశంసలు కురింపించారు.

శాకుంతలం- మల్లికా మల్లికా వీడియో సాంగ్ రిలీజ్
ఇలాంటి జోనర్ లలో సినిమాలు రావడం తక్కువ కాబట్టి ప్రేక్షకులు కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ గుణశేఖర్ కు ఇలాంటి సినిమాలు తీయడంలో ఎక్స్ పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అన్నీసినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అందుకే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు చూద్దామా అనే ఆసక్తితో ఉన్నారు అందరూ. తాజాగా ఈసినిమా నుండి మల్లికా మల్లికా అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాట లిరికల్ సాంగ్ ను గత కొద్దిరోజుల క్రితమే రిలీజ్…

ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్
ప్రామిసింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఆఫీషియల్ గా లాంచ్ కూడా అయ్యింది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు డేట్ ఫిక్స్ చేశారని సమాచారం. ఏప్రిల్ 5నుంచి షూటింగ్ జరుగనుందట. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సెట్ వర్క్ కూడా పూర్తి చేశారు. బ్లాక్ బాస్టర్ కోలీవుడ్ మూవీ తెరి కి రీమేక్ గా తెరకెక్కనుంది ఈ చిత్రం. అయితే పేరుకే ఇది రిమేక్ కానీ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి హరీష్ తనదైన స్టైల్లో తెర మీదకు తీసుకురానున్నాడట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారు. త్వరలోనే ఇందులో నటించనున్న…

దసరాకు దిగుతున్న NBK108
సంక్రాంతి అయిపోయింది.. ఇక ఇప్పుడు దసరాకు ఇప్పటినుండే సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దసరాకు పలు పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయి. రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు, రామ్- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా దసరాకు రిలీజ్ కాబోతున్నాయి. రిలీజ్ డేట్లను కూడా ప్రకటించాయి. ఇప్పుడు బాలకృష్ణ కూడా దసరా బరిలోకి దిగడానికి రెడీ అయిపోతున్నాడు. సంక్రాంతి కి ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన 108వ సినిమాను దసరాకు రిలీజ్ చేస్తున్నాడు.

మెగాస్టార్ పై చంద్రబోస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈసినిమా ఇక్కడ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో భారతీయ సినీ పరిశ్రమ స్థాయి మరో మెట్టు పైకి ఎక్కింది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు వరించడంతో ఇండియన్ సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభినందలు తెలియచేశారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న విరూపాక్ష
మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ నుండి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు పైన అయిపోయింది. రిపబ్లిక్ తరువాత తన నుండి ఇప్పటివరకూ మరో సినిమా రాలేదు. అయితే దానికి కారణం మధ్యలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురికి కావడమే. ఇక ఇప్పుడు తను చేస్తున్న సినిమా విరూపాక్ష. కార్తీక్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్లే ఇటీవలే రిలీజైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

దసరా సక్సెస్ నాని ఎమోషనల్ పోస్ట్
మొత్తానికి నాని అభిమానులతో పాటు అటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న దసరా సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ పోస్టర్ నుండే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. అలా ఫస్ట్ పోస్టర్ నుండి ట్రైలర్ వరకూ వచ్చి ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే మధ్యలో పుష్ప, రంగస్థలం ఛాయలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తరువాత ఆ అపోహలన్నీ తొలగిపోయాయి. సినిమా మొదటి షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ముందు నుండీ ఊహించినట్టే ఈసినిమాలో నాని మాస్ స్టైల్, డైలాగ్స్, యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలానే కీర్తి సురేష్…

హరీష్ శంకర్ బర్త్ డే స్పెషల్..
పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ సినిమాలను అందించే డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్. షాక్ తో డైరెక్టర్ గా ఎంట్రీ గా ఇచ్చిన హరీష్ కు రవితేజ తో తీసిన మిరపకాయ్ ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. షాక్ ప్రశంసలు అందుకున్న కమర్షియల్ గా అంత వర్క్ అవుట్ అవ్వలేదు. అయినా హరీష్ ట్యాలెంట్ చూసి రవితేజ రెండో సారి నమ్మి అవకాశం ఇచ్చాడు అయితే ఈ సారి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు హరీష్. 2011 లో విడుదలైన ఈచిత్రం ఆ ఏడాది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత హరీష్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. హరీష్ కెరీర్ బెస్ట్ మూవీ కూడా ఇదే.

దసరాకు మొదటి రోజు రికార్డు కలెక్షన్స్
నాని నటించిన దసరా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. నిన్న భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మొదటి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టి నానికి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందించింది. పాజిటివ్ రివ్యూస్ తోపాటు బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో దసరా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 38కోట్ల గ్రాస్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డు పడడం తో 14 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక నైజాం లో అయితే ఈ సినిమా మొదటి రోజు జీఎస్టీ తో కలుపుకొని 6.85 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

రెండు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న బలగం
దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించి. ఈ మూవీలో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. భారీ కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.కోటిన్నర ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన బలగం సినిమా25 రోజులలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 24.29 కోట్ల గ్రాస్ ను .. 11.14 కోట్ల షేర్ ను రాబట్టింది. ఒక్క నైజామ్…

దసరా మూవీ టీమ్ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలోసాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హై వోల్టేజ్ ఎమోషనల్ రివెంజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలోధరణి పాత్రలో నాని అలానే వెన్నెల పాత్రలో కీర్తి ఇద్దరూ కూడా మాస్ స్టైల్ యాక్టింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.