దసరాకు దిగుతున్న NBK108

NBK108 Movie Will Release This Dussehra

సంక్రాంతి అయిపోయింది.. ఇక ఇప్పుడు దసరాకు ఇప్పటినుండే సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దసరాకు పలు పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయి. రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు, రామ్- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా దసరాకు రిలీజ్ కాబోతున్నాయి. రిలీజ్ డేట్లను కూడా ప్రకటించాయి. ఇప్పుడు బాలకృష్ణ కూడా దసరా బరిలోకి దిగడానికి రెడీ అయిపోతున్నాడు. సంక్రాంతి కి ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన 108వ సినిమాను దసరాకు రిలీజ్ చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 108 వ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న కాజల్, ఇంకా శ్రీలలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు మేకర్స్. ఉగాది పండుగ సందర్భంగా బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఫస్ట్ లుక్ మాత్రం మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. తాజాగా ఈసినిమా రిలీజ్ పై అధికారిక ప్రకటన ఇచ్చారు. దసరాకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.

కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ప్రియాంక జవాల్కర్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈసినిమాలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల అలరించనుందంట. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =