పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ సినిమాలను అందించే డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్. షాక్ తో డైరెక్టర్ గా ఎంట్రీ గా ఇచ్చిన హరీష్ కు రవితేజ తో తీసిన మిరపకాయ్ ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. షాక్ ప్రశంసలు అందుకున్న కమర్షియల్ గా అంత వర్క్ అవుట్ అవ్వలేదు. అయినా హరీష్ ట్యాలెంట్ చూసి రవితేజ రెండో సారి నమ్మి అవకాశం ఇచ్చాడు అయితే ఈ సారి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు హరీష్. 2011 లో విడుదలైన ఈచిత్రం ఆ ఏడాది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత హరీష్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. హరీష్ కెరీర్ బెస్ట్ మూవీ కూడా ఇదే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దబాంగ్ కు రీమేక్ గా వచ్చిన ఈచిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాదాపు 70కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. మాస్ హీరోను ఎలా చూపించాలో హరీష్ కు బాగా తెలుసు అలాగే ఆయన సినిమాలో డైలాగ్స్ కు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈసినిమా తరువాత హరీష్ ,ఎన్టీఆర్ తోరామయ్యా వస్తావయ్యా , సాయి ధరమ్ తేజ్ తో సుబ్రమణ్యం ఫర్ సేల్ ,అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథమ్ , వరుణ్ తేజ్ తో గద్దల కొండ గణేష్ తీసాడు. ఇందులో రామయ్య వస్తావయ్యా తప్ప మిగితా మూడు సూపర్ హిట్ అయ్యాయి. అయితే గద్దల కొండ గణేష్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న హరీష్ ఇక ఎట్టకేలకు త్వరలోనే మళ్ళీ మెగాఫోన్ పట్టనున్నాడు.
అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ను రెండో సారి డైరెక్ట్ చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ రానుంది. గబ్బర్ సింగ్ లాగే ఈ సారి కూడా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేసాడు. కోలీవుడ్ బ్లాక్ బాస్టర్, తెరికి రీమేక్ గా తెరకెక్కనుంది ఈచిత్రం. అయితే పేరుకే ఇది రీమేక్. తెలుగు వెర్షన్ లో చాలా మార్పులు వుండనున్నాయి. హరీష్ తనదైన స్టైయిల్లో ఈసినిమాను డీల్ చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వున్న ఈ చిత్రం మే నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. అన్ని కుదిరితే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. ఇక ఈరోజు హరీష్ శంకర్ తన బర్త్ డే ను జరుపుకుంటున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటూ… హ్యాపీ బర్త్ డే హరీష్ శంకర్.
హరీష్ శంకర్ సినిమాల్లో మీకు ఏ సినిమా ఇష్టమో ఓటింగ్ ద్వారా తెలియజేయండి.
హరీష్ శంకర్ బర్త్ డే స్పెషల్ ఓటింగ్👇
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: