దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించి. ఈ మూవీలో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. భారీ కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.కోటిన్నర ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన బలగం సినిమా25 రోజులలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 24.29 కోట్ల గ్రాస్ ను .. 11.14 కోట్ల షేర్ ను రాబట్టింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 16.75 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్న బలగం మూవీ ఇటీవలే ఓటీటీలో విడుదలై మరింత ఆధరణ దక్కించుకుంది. ఉగాది బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకున్న బలగం మూవీ తాజాగా రెండు ఇంటర్నేషన్‌ల అవార్డులను గెలుచుకుంది.లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో బలగం మూవీ రెండు అవార్డులను గెలుచుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు వేణు స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు .
Balagam shines on the global stage! 🤩❤️
Congratulations to our director @VenuYeldandi9 and our cinematographer @dopvenu for winning the prestigious Los Angeles Cinematography Awards. 👏🏻👏🏻
Running successfully in theatres near you🙌@priyadarshi_i @kavyakalyanram pic.twitter.com/gCEhvEXLYR
— Dil Raju Productions (@DilRajuProdctns) March 30, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: