శాకుంతలంలో మెహన్ బాబు పాత్ర ఇదే

Interesting Info about Mohan Babu Role in Shaakuntalam

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ,గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలంలో కీలకపాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే మోహన్ బాబు పాత్రేంటి.. ఆయన పాత్ర ఎలా వుండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహా శివుని మరో అవతారమే దుర్వాస ముని.. దుర్వాస ముని మహా కోపిష్టి..అయన కోపం..ఎదుటివాళ్ళకి శాపం. ఒక రోజు దుర్వాస మహర్షి తపస్సులో ఉన్నప్పుడు ..తాను ఉన్న చోటుకి బలి చక్రవర్తి కుమారుడు ఒక అప్సరసతో వస్తారు… తపస్సులో ఉన్న దుర్వాస మునికి వాళ్ళ నవ్వులు వినిపించి తన తపస్సుకి భంగం కలగడంతో ..వాళ్ళని రాక్షసులుగా మార్చేస్తారు. ఒకసారి దుర్వాస ముని గాఢమైన నిద్రలో ఉండగా, తన భార్య వచ్చి తనని లేపినందుకు కోపంతో తన భార్యనే భస్మం చేస్తాడు. కాసేపటికి తన తప్పు తెలుసుకొని తన భార్య పేరు భూమి పైన సజీవంగా ఉండాలని తన భార్య భస్మంతో ఒక చెట్టుని సృష్టిస్తాడు.. అదేఅరటిచెట్టు. ఇలాంటి విచిత్ర కోపిష్టి అయిన దుర్వాస ముని పాత్రలో శాకుంతలం సినిమాలో మనకి కనిపించబోతున్నారు మోహన్ బాబు.

ఇక శాకుంతలం విడుదలకు సిద్దమవుతుంది. సమంత టైటిల్ లో రోల్ లో నటించిన ఈచిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఏప్రిల్ 14 న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదలకానుంది. గుణ టీం వర్క్స్ బ్యానర్ ఫై నీలిమ గుణ ఈచిత్రాన్ని నిర్మించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − eight =