నాని నటించిన దసరా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తుంది. ఈసినిమా మొదటి రోజు ఏకంగా 38కోట్ల గ్రాస్ వసూళ్లతో నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందించగా రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. రెండో రోజు, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 15కోట్ల గ్రాస్ కు పైగా వసూళ్లను రాబట్టింది. దాంతో మొత్తం రెండు రోజుల్లో 53 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు 5 కోట్ల షేర్ ను రాబట్టడంతో మొత్తం రెండు రోజుల్లో 20కోట్ల షేర్ మార్క్ అందుకుంది. ఇందులో నైజాం నుంచి వచ్చిన షేర్ 10కోట్లు ఉండడం విశేషం. అల్రెడీ నైజాం లో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Dasara's MASS RAMPAGE at the Box Office ❤️🔥
53+ CRORES Gross Worldwide in 2 days 💥🔥
– https://t.co/9H7Xp8jaoG#DhoomDhaamBlockbuster
Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP @saregamasouth pic.twitter.com/xPi31ks9Ir— SLV Cinemas (@SLVCinemasOffl) April 1, 2023
అటు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా సత్తా చాటుతుంది. రెండు రోజుల్లో దసరా 1మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. నానికి ఇది 8వ మిలియన్ డాలర్ మూవీ. టాలీవుడ్ హీరోల్లో హైయెస్ట్ మిలియన్ డాలర్ మూవీస్ జాబితాలో 11 సినిమాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉండగా 8సినిమాలతో నాని రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక 50కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన దసరా రేపటి తో బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకోనుంది. వీకెండ్ కావడంతో ఈరోజు రేపు కూడా ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ ను దక్కించుకోనుంది. గత ఏడాది అంటే సుందరానికీ ఇచ్చిన షాక్ తరువాత నాని ,దసరా తో సూపర్ కం బ్యాక్ ఇచ్చాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: