దసరా మూవీ టీమ్ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్

Dasara Movie Team Grand Success Celebrations

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలోసాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హై వోల్టేజ్ ఎమోషనల్ రివెంజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలోధరణి పాత్రలో నాని అలానే వెన్నెల పాత్రలో కీర్తి ఇద్దరూ కూడా మాస్ స్టైల్ యాక్టింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ యాక్షన్ సీన్స్, గ్రాండియర్ విజువల్స్, మాస్ ఫైట్స్, డైలాగ్స్ తో దసరా మూవీ ని ఆద్యంతం ఆకట్టుకునే రీతిలో తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా దసరా మూవీ సూపర్ గా టాక్ ని సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన తమ మూవీ పై ఫ్యాన్స్, ఆడియన్స్ చూపిస్తున్న ఆదరణకు ప్రత్యేకంగా హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్ అమితానందం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.దసరా టీమ్ సక్సెస్ సెలబ్రేషన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.