దసరా పై మహేష్ రియాక్షన్- చాలా గర్వంగా ఉంది

superstar mahesh babu praises on dasara movie

ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చిన సంగతి. ఒకప్పుడు ఒక సినిమా హిట్ అయితే అభిమానులు హడావుడి చేసేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు. ఏదైనా సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నా.. కాస్త డిఫరెంట్ గా ఉన్నా.. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సెలబ్రిటీలు తమ సపోర్ట్ అందించడానికి లేదా ప్రశంసించడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. స్టార్ హీరోలు కూడా అందుకు వెనుకాడట్లేదు. ఇక ఆలాంటి విషయాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎప్పుడూ ముందుటారన్న సంగతి తెలిసిందే. ఏ సినిమా వచ్చినా అభినందనలు చెప్పడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇక ఇప్పుడు దసరా పై కూడా ప్రశంసలు కురింపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా తన ట్విట్టర్ ద్వారా మహేష్ దసరా సినిమాపై స్పందిస్తూ స్టన్నింగ్ సినిమా.. చాలా గర్వంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ కు నాని కూడా తనదైన శైలిలో స్పందించాడు. మహేష్ కి థాంక్స్ చెప్తూ మీరు మంచి సినిమాల పట్ల ఇచ్చే వాయిస్ సపోర్ట్ ఎలా ఉంది అంటే పోకిరి సినిమాకి మణిశర్మ గారి స్కోర్ అందించినట్టుగా ఉంటుంది అని రిప్లై అందించాడు. దీనితో నాని ఫ్యాన్స్ అటు మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో నాని మాస్ స్టైల్, డైలాగ్స్, యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ర్యాంప్ ఆడిస్తుంది. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 17 =