మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ నుండి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు పైన అయిపోయింది. రిపబ్లిక్ తరువాత తన నుండి ఇప్పటివరకూ మరో సినిమా రాలేదు. అయితే దానికి కారణం మధ్యలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురికి కావడమే. ఇక ఇప్పుడు తను చేస్తున్న సినిమా విరూపాక్ష. కార్తీక్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్లే ఇటీవలే రిలీజైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ సినిమా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుందని.. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు కాస్ట్ అండ్ క్రూతో ఉన్న ఫోటోను షేర్ చేశారు.
AND It’s a WRAP!
(Except for one song 😜)A Journey of startling vision, relentless hardwork & team efforts will always make #Virupaksha a memorable & amazing experience.
Can’t wait to meet you all on the big screen on Apr 21st 🤗
Thank you @BvsnP Garu @aryasukku sir@dvlns… pic.twitter.com/uFl42czJEA
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 31, 2023
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.
ఏప్రిల్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: