శాకుంతలం- మల్లికా మల్లికా వీడియో సాంగ్ రిలీజ్

mallika mallika video song out from shakuntalam movie

ఇలాంటి జోనర్ లలో సినిమాలు రావడం తక్కువ కాబట్టి ప్రేక్షకులు కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ గుణశేఖర్ కు ఇలాంటి సినిమాలు తీయడంలో ఎక్స్ పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అన్నీసినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అందుకే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు చూద్దామా అనే ఆసక్తితో ఉన్నారు అందరూ. తాజాగా ఈసినిమా నుండి మల్లికా మల్లికా అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాట లిరికల్ సాంగ్ ను గత కొద్దిరోజుల క్రితమే రిలీజ్ చేయగా ఆకట్టుకుంది. ఇప్పుడు వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో సాంగ్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈపాటతో ఈసినిమా బిగ్ స్క్రీపై విజువల్ వండర్ గా ఉంటుందన్న విషయం అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − four =