దసరా కలెక్షన్స్- దుమ్మురేపుతున్నధరణి

dasara movie 3 days collections

దసరా అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాడు ధరణి. ఎప్పుడూ పక్కింటి అబ్బాయిలా ఉండే పాత్రల్లో కనిపించిన నాని ఈసినిమాతో తనలో ఉన్నఊర మాస్ పాత్రను బయటకు తీసుకొచ్చాడు. గతంలో మాస్ సినిమాలు చేసింది తక్కువ.. చేసినా చాలా తక్కువే చేశాడని చెప్పొచ్చు.. కానీ ఈసినిమాలో మాత్రం రా అండ్ రస్టిక్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా రిలీజ్ కు ముందు ఏర్పడిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో అందరికీ నచ్చేస్తుంది. నాని, కీర్తి సురేష్ ల నటన, శ్రీకాంత్ ఓదెల మేకింగ్, టేకింగ్ లు అందరినీ ఆకట్టుకుంటుండటంతో ఆప్రభావం బాక్సాఫీస్ వద్ద కనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే ఎక్కడా రాజిపడట్లేదు. మొదటి రోజే 38 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈసినిమా రెండు రోజుల్లోనే 53 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసింది. ఇక మూడు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది ఈసినిమా. ఒక్క మూడో రోజే తెలుగు రాష్ట్రాల్లో 6.73 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా 9.18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఓవరాల్ గా మూడురోజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 71కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసుకుంది. ఇక ఓవర్సీస్‌లో కూడా నాని రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ ఈసినిమా 1.4 మిలియన్‌ డాలర్లను వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ముందు ముందు ఈసినిమా ఇంకా కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 1 =