దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈసినిమా ఇక్కడ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో భారతీయ సినీ పరిశ్రమ స్థాయి మరో మెట్టు పైకి ఎక్కింది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు వరించడంతో ఇండియన్ సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభినందలు తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా అభినందించడంలో ఎప్పుడూ ముందుంటారు. తన సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే చిత్రయూనిట్ ను పిలిపించి కానీ ప్రత్యేకంగా తన అభినందనలు తెలుపుతుంటారు. రీసెంట్ గానే బలంగా టీమ్ ను తన భోళాశంకర్ కు పిలిపించి మరీ చిత్రయూనిట్ ను అభినందించి వారిని సన్మానించారు. తాజాగా ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ను కూడా పిలిచి ఆభినందించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మెగాస్టార్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నయ్య కళ్ళల్లో ఇంత ఆనందం చూడడం ఎంతో ఆనందంగా ఉందని అలాగే అన్నయ్య ఎప్పుడూ కూడా నా వేలుని చేతిని వదల్లేదు.. నన్ను ఎంతో ప్రోత్సహించేవారు నాతో ఎన్నో మంచి పాటలు రాయించి నా కలం కి వెలుగు పంచారు అని తెలిపాడు.
ఇక ప్రస్తుతం మెగాస్టార్ భోళాశంకర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: