
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 121


రామబాణం- లక్ష్మణుడు, హనుమంతుడు ఇద్దరూ నేనే

ఎన్టీఆర్ 30 అప్డేట్

ఛత్రపతి హిందీ టీజర్ రిలీజ్

సీక్వెల్స్ తో నిఖిల్- కార్తికేయ3.. స్వామిరారా 2

బ్లాక్ బస్టర్ సీక్వెల్ కు రెడీ

నాని 30-ఫాదర్ గా డిఫరెంట్ రోల్ చేస్తున్నా

లియో చెన్నై షెడ్యూల్ షురూ

వెంకీ సైంధవ్ రిలీజ్ డేట్ ఫిక్స్

పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ రిలీజ్..

విశ్వక్ సేన్ 11వ సినిమా అధికారిక ప్రకటన

టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ డేట్ ఫిక్స్

దసరా కోసంమార్నింగ్ షోస్, ఎక్ట్స్రా షోస్

ధమ్కీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకొని వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు ధమ్కీ. ఈసినిమా ఉగాది పండుగ నాడు రిలీజ్ అయి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ నటన, కథ, పాటలు అన్నీ నచ్చడంతో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా ఎక్కడా తగ్గట్లేదు. విశ్వక్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందిస్తుంది. ఫస్ట్ డే విశ్వక్ సేన్ కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన ఈ చిత్రం..బ్రేక్ ఈవెన్ కూడా సాధించి హిట్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోయింది. ఈ ఫస్ట్ వీక్ లో మొత్తంగా ఈమూవీ రూ. 21.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం…

యూ ఎస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ దిశగా దసరా
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలోసాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హై వోల్టేజ్ ఎమోషనల్ రివెంజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో హీరో నాని, కీర్తి సురేష్ లతో పాటు మిగిలిన లీడింగ్ ఆర్టిస్ట్ లు అందరూ తమ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. నాని – కీర్తి…

రామబాణం- లక్ష్మణుడు, హనుమంతుడు ఇద్దరూ నేనే
మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం రామబాణం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శ్రీవాస్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం సినిమాలు రాగా ఇది మూడో సినిమా. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ‘రామబాణం’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఎన్టీఆర్ 30 అప్డేట్
గత ఏడాది ఆర్ఆర్ఆర్ తో వచ్చి భారీ హిట్ కొట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈసినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాకి చాలా గ్యాప్ తీసుకున్నాడు. తన 30వ సినిమా ను కొరటాల శివతో చేస్తున్నాడని తెలిసిందే. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈచిత్రం వాయిదాపడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈసినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ కూడా రేపటి నుండి ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఈసినిమా కోసం భారీ సెట్ వేశారు. రేపు నైట్ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు.

ఛత్రపతి హిందీ టీజర్ రిలీజ్
తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ అయినా సినిమా, ఛత్రపతి ఇప్పుడూ హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈరీమేక్ లో టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. హిందీలో శ్రీనివాస్ కు ఇదే మొదటి సినిమా. ఒరిజినల్ వెర్షన్ టైటిల్ తోనే తెరకెక్కుతున్న ఈచిత్రానికి వివి వినాయక్ దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. 61 నిమిషాల నిడివి తో వచ్చిన ఈ టీజర్ ను యాక్షన్ సీన్స్ తో నింపేశారు. ఒరిజినల్ వెర్షన్ ను అలాగే హిందీలో తీస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్
బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన జయ జానకి నాయక మూవీ హిందీ వెర్షన్ ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఈ మూవీ 709 మిలియన్ వ్యూస్ రాబట్టింది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు నార్త్‌లో మంచి క్రేజే ఉంది. ఆయన నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్‌లకు మిలియన్ లలో వ్యూస్ వచ్చాయి. సీత, కవచం, సాక్ష్యం, స్పీడున్నోడు వంటి సినిమాలకు వందల మిలియన్ లలో వ్యూస్ సాధించాయి. ఈ క్రేజ్ నేపథ్యంలోనే నేరుగా బాలీవుడ్ లోకి శ్రీనివాస్ ఎంట్రీ ఇస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సూపర్ హిట్ ఛత్రపతి హిందీ రీమేక్ ఛత్రపతి…

రిలీజ్ అయిన రామ బాణం మూవీ శ్రీరామ నవమిస్పెషల్ పోస్టర్
యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్యం, లౌక్యం మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ , డింపుల్ హాయతి జంటగాతెరకెక్కుతున్న రామబాణం మూవీ మే 5 వ తేదీ రిలీజ్ కానుంది.హీరో గోపీచంద్ , శ్రీవాస్ ల హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో జగపతి బాబు , నాజర్ , వెన్నెల కిషోర్ , అలీ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

సీక్వెల్స్ తో నిఖిల్- కార్తికేయ3.. స్వామిరారా 2
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజేస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో కార్తికేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక కార్తికేయ 2 సినిమాకు గాను నిఖిల్ సిద్ధార్థకు పాపులర్ ఛాయిస్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. ప్రస్తుతం నిఖిల్ గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఈసినిమా స్పై. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

బ్లాక్ బస్టర్ సీక్వెల్ కు రెడీ
ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. వాటిలో బోయపాటి శ్రీను-బాలకృష్ణ ది కూడా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. అవిసింహా, లెజెండ్ ఇంకా అఖండ సినిమాలు. ఈ మూడు సినిమాలు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లను అందుకున్నాయి. ఇప్పుడు మరో సినిమాతో రావడానికి సిద్దమయ్యారు వీరిద్దరూ. ఆ సినిమా మరేదో కాదు అఖండ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలకృష్ణ కూడా ఈసినిమా సీక్వెల్ ఉంటుందని క్లారిటీ కూడ ఇచ్చారు.

దసరా రివ్యూ : సూపర్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా
ఓవరాల్ గా భారీ అంచనాలతో వచ్చిన దసరా ఆ అంచనాలను అందుకొని నానికి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాని , కీర్తి సురేష్ ల నటన , యాక్షన్ సన్నివేశాలు , ఇంటర్వెల్ బ్లాక్ , క్లైమ్యాక్స్ ,సంగీతం హైలైట్స్ అయ్యాయి. కేవలం మాస్ , యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా వుంది ఈదసరా.

నాని 30-ఫాదర్ గా డిఫరెంట్ రోల్ చేస్తున్నా
న్యాచురల్ స్టార్ నాని కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన నుండి నేడు రిలీజ్ అవుతున్న సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సింగరేణి గోదావరిఖని గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది ఈసినిమా. ఈ సినిమాలో ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో నటిస్తున్నాడు నాని. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

10 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న రావణాసుర మూవీ ట్రైలర్
ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అను ఇమ్మానుయేల్, దక్షా నగార్కర్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీ లో హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటించారు. నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

యూ ఎస్ లో ప్రీమియర్స్ తోనే హాఫ్ మిలియన్ డాలర్స్ రాబట్టిన దసరా
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ ఈ రోజు (మార్చి 30 వ తేదీ) పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి ప్రమోషన్స్ భారీ గా చేసిన విషయం తెలిసిందే. దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

లియో చెన్నై షెడ్యూల్ షురూ
ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. లియో అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమా మొదలైనప్పటి నుండి శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది. రీసెంట్ గానే కాశ్మీర్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. ఇక తాజా షెడ్యూల్ ను చెన్నైలో మొదలుపెట్టారు. అక్కడ కొన్ని కీలక సన్నీవేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తరువాత ఫైనల్ షెడ్యూల్ ను హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్…

రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ స్పెషల్ పోస్టర్స్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్…

వెంకీ సైంధవ్ రిలీజ్ డేట్ ఫిక్స్
అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొకటి చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో అలరించాడు వెంకీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా చేసేస్తున్నాడు. ఇటీవలే రానాతో కలిసి రానా నాయుడు అనే సినిమాతో అలరించాడు. మరోవైపు వెంకీ సినిమాలను కూడా లైన్ లో పెట్టేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ హీరోగా సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అప్పుడే ఈసినిమా ఫుల్ యాక్షన్ తో ఉంటుందన్న విషయం అర్థమయింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ రిలీజ్..
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్, పొన్నియిన్ సెల్వన్ ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 30న విడుదలైన పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం అన్ని భాషల్లో కలిపి 500కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సెకండ్ పార్ట్ విడుదలకు సిద్దమతుంది. అందులో భాగంగా ఈ రోజు ఈ సినిమా ఆడియో లాంచ్ చెన్నై లో జరిగింది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈఈవెంట్ లో ట్రైలర్ ను కూడా విడుదలచేశారు.

విశ్వక్ సేన్ 11వ సినిమా అధికారిక ప్రకటన
డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇప్పటికే వరుసగా అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ధమ్కీ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే రిలీజ్ అయిన ధమ్కీ సూపర్ హిట్ అవ్వడంతో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టుకుంటుంది. ఇక విశ్వక్ సేన్ ఖాతాలో మరో సినిమా ఉన్న సంగతి తెలిసిందే కదా. విద్యాధర్ దర్శకత్వంలో అడ్వెంచరస్ ఫాంటసీ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ లతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం రావణాసుర సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాపై కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అంతేకాదు ఈసినిమాతో రవితేజ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ఇక ఈసినిమా ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి.

దసరా కోసంమార్నింగ్ షోస్, ఎక్ట్స్రా షోస్
ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో దసరా ఒకటి. ఈసినిమాకోసం కేవలం నాని అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి సారి నాని అంత ఊర మాస్ రోల్ లో కనిపిస్తుండటం.. డిఫరెంట్ కథ, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అందరికీ ఆసక్తిని పెంచింది. ఇక ఇంకా ఒక్క రోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.