
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 119


పుష్ప :ది రూల్ కాన్సెప్ట్ వీడియో టీజర్ రిలీజ్

విశ్వక్ కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు?

రావణాసుర రన్ టైం రివీల్

దసరా-ఊహించిన దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది

జపాన్ లో ఆర్ఆర్ఆర్ రికార్డుల మోత

బ్రహ్మస్త్రం పార్ట్ 2&3 అప్డేట్స్

మీకు నచ్చిన పల్లెటూరి ముద్గుగుమ్మ?

పెళ్లి కూతురిగా కీర్తి మాస్ డ్యాన్స్

నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే

దసరాపై జక్కన్న కామెంట్స్

నయన్ కవల పిల్లల పేర్లు ఇవే

గోవాకు నాని ,ఎన్టీఆర్

బలగం కు అంతర్జాతీయల అవార్డుల పంట

టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

రెయిన్ బో తో వస్తున్న రష్మిక

దసరా పై ప్రభాస్ రివ్యూ

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రారంభం
మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది. పవర్ స్టార్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. వాటిలో ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించినా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఇంతవరకూ నోచుకోలేదు. ఆమధ్య ఈసినిమా ఆగిపోయిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే అలాంటిది ఏం లేదని అప్పుడే క్లారిటీ ఇచ్చారనుకోండి. మరోవైపు అలా ప్రకటించాడో లేడో సముద్రఖని సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి తన టాకీ పార్ట్ పూర్తి చేసేశాడు. దీంతో ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప :ది రూల్ కాన్సెప్ట్ వీడియో టీజర్ రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప :ది రూల్ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈనెల 7న సాయంత్రం 4:05 గంటలకు ఈకాన్సెప్ట్ వీడియో ను విడుదలకానుందని కొద్దీ సేపటి క్రితం ఒక చిన్నటీజర్ ద్వారా మేకర్స్ తెలిజేశారు. ఇక ఈ టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో పారిపోయిన పుష్ప ఎక్కడ వున్నాడు అంటూ టీజర్ సార్ట్ అయ్యింది. అసలు పుష్పను ఎందుకు అరెస్ట్ చేసారు? జైలు నుండి తప్పించుకొని ఎటువెళ్ళాడు? పెళ్లి తరువాత ఏం జరిగింది అనే విషయాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి చాలా రోజుల నుండి…

సల్మాన్-వెంకీ తో చెర్రీ మాస్ స్టెప్పులు
సల్మాన్ ఖాన్ హీరోగా ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో టాలీవుడ్ అగ్రహీరో వెంకీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమాలో మెగావపర్ స్టార్ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. పాటలో రామ్ చరణ్ కనిపిస్తాడన్న కథనాలు రావడంతో పాటను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

విశ్వక్ కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు?
డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇప్పటికే వరుసగా అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ధమ్కీ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే రిలీజ్ అయిన ధమ్కీ సూపర్ హిట్ అవ్వడంతో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టుకుంటుంది. ప్రస్తుతం విశ్వక్ గామి చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. రీసెంట్ గానే తన 11వ సినిమాను ప్రకటించారు మేకర్స్. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

రావణాసుర రన్ టైం రివీల్
మాస్ మహారాజ రవితేజ హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ కోసం ఈశుక్రవారం రావణాసుర తో రానున్నాడు. ఇంతకుముందు ధమాకా తో 100కోట్ల క్లబ్ లో చేరి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన రవితేజ ఈసంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మరో బ్లాక్ బాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు రావణాసుర ను దింపుతున్నాడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

బోయపాటి గారు అప్పుడే విలన్ గా ఫిక్స్ అయ్యారు
ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.

దసరా-ఊహించిన దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది
నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులని నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న దసరా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సందర్భంగా హీరో నేచురల్ స్టార్ నాని విలేకరుల సమావేశంలో దసరా బ్లాక్ బస్టర్ విశేషాలని పంచుకున్నారు.

జపాన్ లో ఆర్ఆర్ఆర్ రికార్డుల మోత
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఈసినిమా రిలీజ్ అయిన ఏడాది పూర్తయి ఇంకా ఈసినిమా గురించి మాట్లాడుతుంటున్నామంటేనే అర్థమవుతుంది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చరిత్రలో అసలు కలవని ఇద్దరు స్వతంత్య్ర సమరయోధుల కథలను తీసుకొని ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత ప్రభంజనం సృష్టించిందో.. ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతే ప్రభంజనం సృష్టిస్తుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొని ఫైనల్ గా అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అస్కార్ అవార్డును సైతం దక్కించుకొని చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

బ్రహ్మస్త్రం పార్ట్ 2&3 అప్డేట్స్
రణబీర్ కపూర్ ,అలియా భట్ జంటగా నటించిన ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా బ్రహ్మస్త్రం:మొదటి భాగం-శివ గత ఏడాది సెప్టెంబర్ 9న విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీ గా విడుదలైన ఈ చిత్రం ఒక్క హిందీలోనే కాదు తెలుగులోనూ మంచి వసూళ్లను దక్కించుకుంది. భారీ బడ్జెట్ తో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున,డింపుల్ కపాడియా,మౌని రాయ్ కీలకపాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా సినిమాలో విఎఫ్ఎక్స్ కి ప్రశంసలు దక్కాయి.

మీకు నచ్చిన పల్లెటూరి ముద్గుగుమ్మ?
గతంలో కొంతకాలం హీరోయిన్ అంటే హీరోతో నాలుగు సన్నివేశాలు.. పాటల్లో కనిపిస్తే పని అయిపోయేది అన్న అభిప్రాయాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. హీరోయిన్స్ కూడా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఏ మాత్రం మొహమాటం లేకుండా నో అని చెప్పేస్తున్నారు. అంతేకాదు కేవలం గ్లామర్ గా మాత్రమే కనిపించాలని అన్న ధోరణి నుండి బయటకు వచ్చి డీ గ్లామర్ పాత్రల్లో సైతం నటించడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా పల్లెటూరి పిల్లలా కనిపిస్తూ తమలో ఉన్న మరో మాస్ కోణాన్ని చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే రంగస్థలంలో సమంత, పుష్ప లో శ్రీవల్లిగా రష్మిక మందన్న, విరాటపర్వంలో సాయి పల్లవి నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకోగా.. రీసెంట్…

పెళ్లి కూతురిగా కీర్తి మాస్ డ్యాన్స్
కీర్తి సురేష్ కూడా ఇప్పుడు ప్రతి సినిమాలో తన పాత్ర డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటుంది. అందుకే డిఫరెంట్ గా సినిమాలు ఎంచుకుంటూ కేరీర్ లో దూసుకుపోతుంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. అయితే కీర్తి సురేష్ కు కూడా సక్సెస్ రేట్ కాస్త తక్కువనే చెప్పొచ్చు. సినిమా అవకాశలకు అయితే మాత్రం ఎలాంటి కొదువలేదు కానీ విజయాల కంటే అపజయాలే ఎక్కువ సొంతం చేసుకుంది. కానీ మహానటి లాంటి సినిమాతో మాత్రం తనేంటో నిరూపించుకుంది. ఇక మహానటి తరువాత పలు లేడీ ఒరియెంటెడ్ సినిమాలే చేసినా అవి కూడా సక్సెస్ అందించలేకపోయాయి. ఇక ఇప్పుడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది. గతఏడాది సర్కారు వారి పాట సినిమాతో హిట్…

షాక్ ఇచ్చిన దసరా 5వ రోజు కలెక్షన్స్
నాని,కీర్తి సురేష్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ దసరా గత గురువారం విడుదలై నాలుగు రోజులు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా 5వరోజు కూడా డీసెంట్ హోల్డ్ ను కొనసాగించింది. వర్కింగ్ డే కావడం అలాగే నైట్ షోస్ మీద ఐపీఎల్ ప్రభావం వున్నా కూడా మంచి వసూళ్లను దక్కించుకుంది. ఇక ఈసినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2కోట్ల షేర్ ను రాబట్టి మొత్తం 5రోజుల్లో 34కోట్ల షేర్ నుకలెక్ట్ చేసింది.

నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఏది వస్తే ఆపాత్ర కాకుండా.. తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ తన అందం, అభినయం, డ్యాన్స్ తో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా సాయిపల్లవి బిహేవియర్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తుంటారు. అందుకే లేడీ పవర్ స్టార్ అనే బిరుదును సైతం దక్కించుకుంది.

దసరాపై జక్కన్న కామెంట్స్
ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా దసరా సినిమా గురించే వినిపిస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా దసరా. మార్చి 30వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకుపోతుంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఫుల్ రా అండ్ రస్టిక్ గా ఈసినిమాను తెరకెక్కించాడు శ్రీకాంత్. దర్శకుడిగా మొదటి సినిమా అయినా కూడా కథని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయడంతో శ్రీకాంత్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అంతేకాదు నాని, కీర్తి సురేష్ కూడా మాస్ రోల్స్ లో నటించారు అని చెప్పడం కంటే జీవించారు అని చెప్పొచ్చు. కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అందించారు. దాని…

నయన్ కవల పిల్లల పేర్లు ఇవే
ఎంతోకాలం ప్రేమాయణం సాగించిన తరువాత లేడీ సూపర్ స్టార్ నయనతార , విఘ్నేష్ శివన్ వివాహబంధంతో బయటయ్యారు. గతేడాది జూన్ లో వీరు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రలైనట్టు ప్రకటించి ఒకరకంగా అందరికీ షాకిచ్చారు. అయితే సరోగసి ద్వారా గతేడాది అక్టోబర్ లో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు. ఇక అప్పుడుప్పుడు పిల్లలతో బయట కనిపిస్తున్నారు కూడా. అయితే ఇప్పటివరకూ వారిద్దరినీ చూపించింది లేదు. ఇక ఇప్పుడు తన పిల్లల పూర్తి పేర్లను ప్రకటించారు నయన్ దంపతులు.

గోవాకు నాని ,ఎన్టీఆర్
దసరాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు నాని. ఈసినిమా రేపటితో 100కోట్ల క్లబ్ లోకి చేరనుంది. ఇక నాని తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయనున్నాడు.ఇటీవలే లాంచ్ అయిన ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మొదటి షెడ్యూల్ గోవాలో జరుగనుంది.ఈలాంగ్ షెడ్యూల్ ఈరోజే ప్రారంభంకానుంది. ఇందుకోసం నాని,గోవా వెళ్లనున్నాడు.ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్నఈ సినిమాకి శౌర్యువ్ డైరెక్టర్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్.వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్లా వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.

బలగం కు అంతర్జాతీయల అవార్డుల పంట
సినిమా తీసేప్పుడు కూడా తమ సినిమాకు ఈరేంజ్ లో ఆదరణ లభిస్తుందని అనుకొని ఉండరు బలగం చిత్రయూనిట్. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందంటే మాములు విషయం కాదు. కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఈసినిమాతో దర్శకుడిగా మారి సక్సెస్ ను అందుకున్నాడు. వేణు నుండి సినిమా వస్తుంది అంటే ఎలా ఉంటుందో అనుకున్నారు కానీ తెలంగాణ సంస్కృతి, మానవ సంబంధాలని మనసులకు హత్తుకునేలా భావోద్వేగాలతో నిండిన కథను తీసుకొచ్చి దర్శకుడిగా విజయాన్ని సాధించాడు. అందుకే రిలీజ్ అయి నెల రోజులు అయిపోతున్నా కూడా ఈసినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న…

టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?
యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం డీజే టిల్లు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా పేరుతెచ్చుకున్న ఈ సీక్వెల్, టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో వస్తుంది. ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో వుంది.

రెయిన్ బో తో వస్తున్న రష్మిక
స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార, సమంత ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉండగా వారితో పాటు కీర్తి సురేష్ ఇంకా పలువురు హీరోయిన్లు ఇప్పటికే లేడి ఒరియెంటెడ్ సినిమాలు చేయగా.. ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఆలిస్ట్ లో చేరిపోయింది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కుఎదిగింది. 'పుష్ప' సినిమాతో తన ఇమేజ్ ని అమాంతం పెంచుకుంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక ఈ ఏడాది స్టార్టింగ్ లోనే వారసుడు సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. రీసెంట్ గానే…

దసరా పై ప్రభాస్ రివ్యూ
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద న్యాచురల్ స్టార్ నాని హవా నడుస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలోనాని పక్కా ఊరమాస్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకోవడమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ ను సైతం రాబట్టుకుంటుంది.