మార్చి నెల దసరా లాంటి బ్లాక్ బస్టర్ తో ముగిసింది.ఇక ఇప్పుడు ఏప్రిల్ లో పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది విరూపాక్ష సినిమాకోసం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయింది. టీజర్ సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పెంచేసింది. ఇక ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేశారు. ఇదిలా ఉండగా ఈసినిమా ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో నేడు మంత్ ఆఫ్ విరూపాక్ష అంటూ మేకర్స్ నేటి నుండి రిలీజ్ వరకూ ప్రమోషన్స్ ను విస్తృతంగా చేయనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: