దసరాకు మొదటి రోజు రికార్డు కలెక్షన్స్

Dasara Movie First Day Collections

నాని నటించిన దసరా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. నిన్న భారీ అంచనాలతో  విడుదలైన ఈ చిత్రం మొదటి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టి నానికి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందించింది. పాజిటివ్ రివ్యూస్ తోపాటు బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో  దసరా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 38కోట్ల గ్రాస్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డు పడడం తో 14 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక నైజాం లో అయితే ఈ సినిమా మొదటి రోజు జీఎస్టీ తో కలుపుకొని 6.85 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా అదరగొడుతుంది. నానికి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉందని తెలిసిందే . దాంతో ఈసినిమా మొదటి రోజే 800k వసూళ్లను రాబట్టింది. ఈరోజుతో అక్కడ 1మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది. నానికి కి  8వ మిలియన్ డాలర్ మూవీ కానుంది. ఓవరాల్ గా  దసరా మొదటి  రోజు ప్రపంచ వ్యాప్తంగా 19.4కోట్ల షేర్ రాబట్టి ఊహించిన దానికంటే ఎక్కువగా కలెక్ట్ చేసింది.

సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈసినిమాను తెరకెక్కించాడు. అతనికి ఇదే మొదటి సినిమా. ఇక మొదటి సినిమాతోనే మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ ను సాధించిన డైరెక్టర్ గా శ్రీకాంత్ రికార్డు సృష్టించాడు. ఈసినిమా తరువాత శ్రీకాంత్ కు ఆఫర్స్ క్యూ కట్టడం ఖాయం. రూరల్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈచిత్రంలో నానికి జంటగా కీర్తి సురేష్ నటించగా సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకం పై చెరుకూరి సుధాకర్ నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 5 =