దసరా సక్సెస్ నాని ఎమోషనల్ పోస్ట్

nani emotional post on dasara success

మొత్తానికి నాని అభిమానులతో పాటు అటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న దసరా సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ పోస్టర్ నుండే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. అలా ఫస్ట్ పోస్టర్ నుండి ట్రైలర్ వరకూ వచ్చి ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే మధ్యలో పుష్ప, రంగస్థలం ఛాయలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తరువాత ఆ అపోహలన్నీ తొలగిపోయాయి. సినిమా మొదటి షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ముందు నుండీ ఊహించినట్టే ఈసినిమాలో నాని మాస్ స్టైల్, డైలాగ్స్, యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలానే కీర్తి సురేష్ యాక్టింగ్ పై చాలా సహజంగా రూపొందించినందుకు దర్శకుడు శ్రీకాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో తన సినిమాను సక్సెస్ చేసినందుకు గాను నాని తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. మీరు మా దసరా మూవీ పై చూపిస్తున్న ప్రేమకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, మీ ప్రేమ అంతా నా హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది అంటూ పోస్ట్ లోపేర్కొన్నాడు నాని. ప్రస్తుతం ఈపోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 19 =