సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూాశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఎప్పటినుండో ఈసినిమా అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు రీసెంట్ గానే ఈసినిమా నుండి మహేష్ లుక్ ను అలానే రిలీజ్ డేట్ ను ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. మాస్ లుక్ లో ఉన్న మహేష్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 13వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో అప్ డేట్ సిద్దంగా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31 అన్న సంగతి తెలిసిందే కదా. ఆరోజు ఈసినిమా నుండి అప్ డేట్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే తెలిపారు. అయితే ఇప్పుడు అప్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చాడు థమన్. మే 31వ తేదీన అప్ డేట్ కన్ఫామ్ గా ఉంటుందన్నట్టు తన ట్విట్టర్ లో డ్రమ్స్ ఎమోజీ పోస్ట్ చేశాడు థమన్. అయితే ఆరోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి చూద్దం ఆరోజు ఏం అప్ డేట్ వస్తుందో.
MAY31st 🔥#SSMB28 🤙🥁 pic.twitter.com/Znk9hRzcM0
— thaman S (@MusicThaman) April 1, 2023
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: