కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 117

namrata shares super star mahesh babus stylish pic
సినిమా వార్తలు

సూపర్ స్టార్ సూట్ గేమ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ జంట ముందు ప్లేస్ లోనే ఉంటుంది. మహేష్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటే మరోవైపు నమ్రత అటు బిజినెస్ లో దూసుకుపోతుంది. ఇక నమ్రత సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంకా పిల్లలు గౌతమ్, సితార లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడూ తన ఇన్ట్సాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కు సంబంధించిన పిక్స్ కూడా తన ఇన్ట్సాలో అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ కు సంబంధించిన కూల్ పిక్ షేర్ చేసింది. బ్లూ కలర్ సూట్ వేసుకొని ఉన్న మహేష్ పిక్ ను షేర్ చేస్తూ…

TFN Adminవాట్సాప్
sai dharam tej virupaksha movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

విరూపాక్ష ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కూడా తన నటనతో, సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. రిపబ్లిక్ లాంటి మెసేజ్ ఒరియెంటెడ్ సినిమా తరువాత తన నుండి వస్తున్న సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది.ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టేశారు చిత్రయూనిట్. ఏప్రిల్ 21వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మంత్ ఆఫ్ విరూపాక్ష పేరుతో రిలీజ్ వరకూ వరుసగా అప్ డేట్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు, పోస్టర్లు…

TFN Adminవాట్సాప్
samantha birthday wishes to akhil
సినిమా వార్తలు

అఖిల్ కు సామ్ బర్త్ డే విషెస్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా 'ఏజెంట్'. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అఖిల్ పూర్తిగా తన లుక్ మార్చేశాడు.. సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకోనున్నాడు. ఈసినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టెసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
pawan kalyan and sujeeth og movie full on swing
సినిమా వార్తలు

ఫుల్ స్వింగ్ లో పవన్ ఓజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హరిహర వీరమల్లు ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా టాకీ పూర్తయిపోయింది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ రీసెంట్ గానే ప్రారంభమైంది.ఇక వీటితో పాటు పవన్-సుజీత్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
naresh and pavitra lokesh starrer malli pelli movie teaser update
ట్రైలర్ & టీజర్

నరేష్, పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ టీజర్ రిలీజ్ డేట్

ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్లీ పెళ్లి’. తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈసినిమాను విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా విడుదలకు సిద్ధమవుతుండగా చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటివరకూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌, గ్లింప్స్ లో లీడ్ పెయిర్ అందమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Pushpa The Rule First Look Creates Massive Record
ఫస్ట్ లుక్

రికార్డు సృష్టించిన పుష్ప 2 ఫస్ట్ లుక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ది రూల్ నుండి విడుదలైన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చిత్తూరులో జరిగే గంగమ్మ జాతరలో అమ్మవారిని పోలిన లుక్ లో వున్న అల్లు అర్జున్ పోస్టర్ ను నిన్న విడుదలచేయగా మాములు రెస్పాన్స్ రావడంలేదు.అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా నిన్న విడుదలైన ఈ పోస్టర్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈపోస్టర్ ను బన్నీ తన సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేయగా..ఇంస్టాగ్రామ్ లో 5M లైక్స్, ట్విట్టర్ లో 207k లైక్స్ అలాగే ఫేస్ బుక్ లో 850k లైక్స్ తో అత్యధిక లైక్స్ పొందిన ఫస్ట్ లుక్ గా రికార్డు సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
star cricketer david warner special birthday wishes to allu arjun
సినిమా వార్తలు

బన్నీకి వార్నర్ స్పెషల్ బర్త్ డే విషెస్

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ తో తను ఎంత ఫేమస్ అయ్యాడో ఈమధ్య సోషల్ మీడియాలో కూడా పలు వీడియోలతో అంతే ఫేమస్ అయ్యాడు. గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో వార్నర్ చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్ని సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. ‌అలవైకుంఠపురములో మూవీలో 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలతో మొదలైన ఈ ప్రస్థానం ఆతరువాత పలు హీరోల పాటలకు కూడా తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్.. బాహుబలి సినిమాలో 'అమరేంద్ర బాహుబలి అనే నేను'…

TFN Adminవాట్సాప్
Ravi Teja's Ravanasura Movie Day 1 Box Office Collections
బాక్సాఫీస్

రావణాసుర డే 1 కలెక్షన్స్

వరస విజయాలతో సూపర్ ఫామ్ లో వున్న రవితేజ,రావణాసుర తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. నిన్న మంచి హైప్ తో విడుదలైన ఈచిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.దాంతో ఈసినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 9కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో షేర్ 5కోట్లు.నిన్న పబ్లిక్ హాలిడే కావడం కూడా సినిమాకు కలిసొచ్చింది. ఇక ఈరోజు,రేపు కూడా ఈసినిమా మంచి వసూళ్లను దక్కించుకోనుంది.రవితేజ ఈసినిమాలో నెగిటివ్ షేడ్ లో కనబడి షాక్ ఇచ్చాడు.

Mahender Reddyవాట్సాప్
Ravi Teja Hits Hattrick Blockbuster with Ravanasura
సినిమా వార్తలు

రావణాసురతో రవితేజ హ్యాట్రిక్

మాస్ మాహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసురకు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నిన్న మంచి అంచనాల మధ్య విడుదలైన ఈసినిమాకు మౌత్ టాక్ బాగుండడంతో తొలిరోజు 9కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రవితేజ నటన సినిమాకు మెయిన్ హైలైట్ అయ్యింది.ముఖ్యంగా నెగిటివ్ షేడ్ లో రవితేజ యాక్టింగ్ కు ఫ్యాన్స్ తోపాటు మిగితా ప్రేక్షకులు థ్రిల్ అవుతున్నారు.రవితేజ యాక్టింగ్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్,విజువల్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి. ఇక ఈసినిమా విజయంతో రవితేజ హ్యాట్రిక్ కొట్టాడు.గత ఏడాది చివర్లో ధమాకాతో 100కోట్ల క్లబ్ లో చేరిన రవితేజ ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో…

Mahender Reddyవాట్సాప్
Indian 2 movie Taiwan schedule wraps up
షూటింగ్ అప్‌డేట్

ఇండియన్ 2 తైవాన్ షూట్ కంప్లీట్

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా. ఈసినిమా షూటింగ్ ను జూన్ వరకూ కంప్లీట్ చేస్తామని ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ తెలిపిన సంగతి తెలిసిందే. ఆదిశగానే ఇప్పుడు షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ఇక ఒకవైపు రామ్ చరణ్ తో సినిమాను పూర్తి చేస్తూనే మరోపక్క ఇండియన్ 2 సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు మరో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నాడు. తాజాగా ఈసినిమా తైవాన్…

TFN Adminవాట్సాప్
pushpa 2 first look poster create new records
ఫస్ట్ లుక్

పుష్ప2 ఫస్ట్ లుక్ రికార్డ్

పుష్ప 2 అంటూ అలా వచ్చాడో లేదో అప్పుడే రికార్డులు మొదలుపెట్టేశాడు బన్నీ. పుష్ప సినిమా మొదలైనప్పుడు అప్పట్లో కూడా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసి రికార్డులు క్రియేట్ చేశాడు బన్నీ. ఇక రిలీజ్ అయిన తరువాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక నేడు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా అప్ డేట్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. నిన్ననే ఈసినిమా నుండి వేర్ ఈజ్ పుష్ప అంటూ ఒక వీడియోను అలానే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
natural star nani dasara movie USA collections update
బాక్సాఫీస్

యూఎస్ లో దసరా హవా

న్యాచురల్ స్టార్ నాని దసరాతో తనలోని ఊర మాస్ యాంగిల్ ను చూపించాడు. డెబ్యూ సినిమా అయినా కూడా శ్రీకాంత్ ఓదెల చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ లాగానే తన మేకింగ్ తో ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు. నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించడం, సినిమా సాంగ్స్ బాగుండటం, ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్, అదిరిపోయిన సినిమా క్లైమాక్స్ ఇవన్నీ సినిమాకి ప్లస్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. ఈసినిమా కలెక్షన్స్ మాత్రం ఆగట్లేదు. ఊచకోత కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. ఇక ఇక్కడ మాత్రమే కాదు ఈసినిమా యూఎస్ లో కూడా తన హవా చూపిస్తుంది దసరా. 2 మిలియన్ డాలర్స్ క్లబ్ లో దసరా చేరుతుంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా 1.9 మిలియన్ మార్క్ కి…

TFN Adminవాట్సాప్
venu yeldandi wins international award as best director for balagam movie
సినిమా వార్తలు

బలగం- అంతర్జాతీయ అవార్డ్ అందుకున్న వేణు

కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బలగం. ఎలాంటి అంచనాలు లేకుండా ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈసినిమా చూసిన తరువాత ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మౌత్ టాక్ తో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించిన జీవనచిత్రంగా ప్రశంసలను అందుకుంది.

TFN Adminవాట్సాప్
lawrence rudhrudu movie telugu trailer out
ట్రైలర్ & టీజర్

రుద్రుడు ట్రైలర్ రిలీజ్

కదిరేశన్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా రుద్రుడు. ఈసినిమా తమిళ్ లో రుద్రన్ టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో రుద్రుడు అనే టైటిల్ తో వస్తుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ .

TFN Adminవాట్సాప్
allu arjun different look out from pushpa 2 movie
సినిమా వార్తలు

పుష్ప2-పూనకాలు తెప్పిస్తున్న బన్నీ లుక్

దేశ వ్యాప్తంగా అందరూ వెయిట్ చూస్తున్న సినిమాల్లో పుష్ప2 సినిమా ఒకటి. మొదటి పార్ట్ సంచలన విజయం సాధించడంతో రెండో పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే ఈసినిమా నుండి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. మరోవైపు ఫ్యాన్స్ అప్ డేట్ కోసం ఎప్పటినుండో చూస్తున్నారు. ఈనేపథ్యంలోనే రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఓ వీడియో ను రిలీజ్ చేశారు. వేర్ ఈజ్ పుష్ప అనే క్యాప్షన్ తో రిలీజ్ అయిన ఈవీడియో ఇప్పుడు ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
rashmika mandanna sarcastic reply about dating rumors with vijay deverakonda
సినిమా వార్తలు

విజయ్ తో డేటింగ్ రూమర్స్ పై రష్మిక కౌంటర్

సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే మాములు విషయం కాదు. ఇక ఒకసారి స్టార్ స్టేటస్ వచ్చిందంటే వివాదాలు కూడా ఎప్పుడూ పక్కనే ఉంటాయి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాలపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తుంటూనే ఉంటుంది. ఇక అలాంటి రూమర్స్ ఎదుర్కొంటున్న వారిలో రష్మిక కూడా ఉంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది రష్మిక. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే రష్మిక రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో డేట్ చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈమధ్య వీరిద్దరూ వెకేషన్ కు వెళ్లినప్పుడు పలు వార్తలు రాగా వాటిపై స్పందించిన రష్మిక కూడా తాము ఫ్రెండ్స్ అని.. మేమిద్దరం ఫ్రెండ్లీ గా…

TFN Adminవాట్సాప్
Pushpa 2 The Rule Allu Arjun Birthday Special Glimpse Out Now
ట్రైలర్ & టీజర్

పుష్ప 2 ది రూల్ వీడియో రిలీజ్ : ఇది పుష్ప గాడి రూల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సీక్వెల్ .. పుష్ప ది రూల్ నుండి వీడియో రిలీజ్ అయ్యింది. పుష్ప 2 ది రూల్ పేరుతో 3నిమిషాల 15సెకండ్ల రన్ టైం తో ఈవీడియోను కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో పుష్ప ది రూల్ ఎలా వుండబోతుందో చూపించారు. జైలు నుండి తప్పించుకున్న పుష్ప ఎక్కడున్నాడు సమాధానంగా ఈవీడియోను రిలీజ్ చేశారు. జైలు నుండి బుల్లెట్ గాయాలతో పుష్ప తప్పించుకొని శేషాచలం అడవుల్లోకి పారిపోవడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ను మొదలు పెడతారు. అందులో భాగంగా ఓ కొండపై పుష్ప ధరించిన షర్ట్ దొరుకుంది దానికి ఏకంగా 8బుల్లెట్ రంద్రాలు ఉండడంతో పుష్ప చనిపోయి ఉంటాడని వదంతులు వ్యాపిస్తాయి…

Mahender Reddyవాట్సాప్
akhils special birthday poster released from agent movie
ఫస్ట్ లుక్

ఏజెంట్- అఖిల్ బర్త్ డే బ్లాస్టింగ్ పోస్టర్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్. ఈ సినిమా ఓ స్పై థ్రిల్లర్ అని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి సినిమా అంటే అటు యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు స్టైయిలీష్ గా మేకింగ్ ఉంటుంది. దానికితోడు అఖిల్ మేకోవర్ కూడా పూర్తిగా మార్చేశాడు. అందుకే ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో వాయిదాల అనంతరం ఫైనల్ గా ఈసినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు, అలానే మళ్లీ మళ్లీ నువ్వే అనే పాట ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ రోజు అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమామా బ్లాస్టింగ్…

TFN Adminవాట్సాప్
suriya 42 movie title and release date announcement update
రిలీజ్ అప్‌డేట్

సూర్య 42 టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ డేట్ ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అయితే తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ కు అలానే రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 16వ తేదీన ఉదయం 9 గంటల 5 నిమిషాలకు ఈసినిమా టైటిల్ ను అలానే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
ram charan about yentamma song
సాంగ్

ఏంటమ్మా పాట సెలబ్రేషన్స్ కి బెస్ట్ సాంగ్

సల్మాన్ ఖాన్ హీరోగా ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో టాలీవుడ్ అగ్రహీరో వెంకీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఈద్ సంద‌ర్భంగా ఏప్రిల్ 21న రిలీజ్ అవుతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే రీసెంట్ గా ఈసినిమా నుండి ఏంట‌మ్మా అనే పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈపాటలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, టాలీవుడ్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేష్‌లతో పాటు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా కనిపించడంతో పాటకు సూపర్ రెస్పాన్స్…

TFN Adminవాట్సాప్

షేర్