
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 118


పద్మ శ్రీ అందుకున్న కీరవాణి

హనుమాన్ మూవీ నుండి హనుమాన్ చాలీసా రిలీజ్

శాకుంతలంలో సమంత పాత్ర ఇదే

నెగిటివిటీ అనే చెడు మీద మంచి గెలిచింది

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఉగ్రం

రామ్ చరణ్, ఉపాసన బేబి షవర్ సెల్రబేషన్స్

నాని ఊచకోత- 100 కోట్ల దసరా

ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతున్న విరూపాక్ష

20 ఏళ్ల సక్సెఫుల్ జర్నీ

విజువల్ వండర్ గా శాకుంతలం ట్రైలర్

శాకుంతలంలో దుష్యంతుడి పాత్ర ఇదే..

ఆ ఒక్కటీ అడగొద్దు

అశోక్ గల్లా2 యాక్షన్ టీజర్ రిలీజ్

సమంత పై ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బలగం షోస్ ఆపేదే లేదు

వార్ 2 కి సిద్దమైన హృతిక్, ఎన్టీఆర్

ధమ్కీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. తన టాలెంట్ తో నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. కేవలం హీరోగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు విశ్వక్ సేన్. అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, రీసెంట్ గా ధమ్కీ ఇలా డీసెంట్ హిట్ లను అందుకొని దూసుకుపోతున్నాడు. ధమ్కీ సినిమా ఉగాది పండుగ నాడు రిలీజ్ అయి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ నటన, కథ, పాటలు అన్నీ నచ్చడంతో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా ఎక్కడా తగ్గట్లేదు. విశ్వక్ కెరీర్ బెస్ట్…

ఓటీటీ లోకి వచ్చేసిన రంగమార్తాండ
కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇక ఈవిషయం మరోసారి నిరూపించారు. ఈమధ్య కాలంలో అలా వచ్చిన సినిమాల్లో రంగమార్తాండ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా గత నెలలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఈసినిమా ద్వారా ల్లితండ్రులు బాగున్నప్పుడే వారిని చూసుకోవాలని మెసేజ్ ను ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈసినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఈసినిమా అమెజాన్ లో నేటి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ ఎమోషనల్ రైడ్…

పద్మ శ్రీ అందుకున్న కీరవాణి
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. ఈసినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ ను సైతం అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్శశ్రీ అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఏడాది మొత్తం 106 పద్మ పురస్కారాలు ప్రకటించగా.. మార్చి 22 న తొలి విడతలో 50 మందికి పైగా ఇచ్చారు. ఇక ఇప్పుడు మిగిలిన వారందరికీ పురస్కారాలు అందచేశారు. దీనిలో భాగంగానే కీరవాణి కూడా పద శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

హనుమాన్ మూవీ నుండి హనుమాన్ చాలీసా రిలీజ్
విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ ను…

శాకుంతలంలో సమంత పాత్ర ఇదే
ఈనెల14న శాకుంతలం థియేటర్లలోకి రానుంది. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ ఈసినిమాను తెరకెక్కించాడు.ఈసినిమాలో సమంత టైటిల్ రోల్ ను పోషించింది.ఈసందర్భంగా అసలు శకుంతల ఎవరు.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

అల్లు అర్హ కి తెలుగు తప్ప ఇంకేం నేర్పలేదు- గుణశేఖర్
రుద్రమదేవి తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఈసారి శాకుంతలం అనే పురాణగాధని తెరకెక్కించాడు డైరెక్టర్ గుణశేఖర్. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం ఆధారంగా శాకుంతలం అనే సినిమాను రూపొందించాడు. ఇందులో సమంత, శకుంతలగా నటించగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ,శకుంతల కుమారుడు భరతుడిగా కనిపించనుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూ లో గుణశేఖర్ ,అర్హ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

నెగిటివిటీ అనే చెడు మీద మంచి గెలిచింది
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన సినిమా దసరా. ఈసినిమా రిలీజ్ కు ముందే భారీ అంచనాలను ఏర్పరుచుకొని.. ఆఅంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండటంతో ఇప్పుడు ఈసినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కినా కూడా ఈసినిమా అందరికీ కనెక్ట్ అవుతుండటంతో అందరూ సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈసినిమాలో నటీనటుల నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ శ్రీకాంత్ మేకింద్ కు అందరూ ఫిదా అవుతున్నారు. అందుకే వారం రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందిస్తుంది…

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఉగ్రం
అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ప్రస్తుతం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కెరీర్ లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా ఉగ్రం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఇది వరకే నరేష్, విజయ్ కాంబినేషన్ లో నాంది అనే వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను కూడా అందుకుంది.

రామ్ చరణ్, ఉపాసన బేబి షవర్ సెల్రబేషన్స్
మెగా అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడు తండ్రి అవుతాడా అని. ఇక ఎన్నో ఎళ్లు నుండి ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ ఇటీవలే అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్, ఉపాసన బేబీ షవర్ సెలబ్రేషన్స్ దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి దగ్గరి స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఈ వేడుకలో చరణ్, ఉపాసన జంట చూడ ముచ్చటగా అనిపించారు. ఉపాసన సోదరి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి ఈ పార్టీని అద్భుతంగా నిర్వహించారు. ఇవి వారికి మరుపురాని క్షణాలుగా చెప్పవచ్చు. ఉపాసన అమ్మమ్మ ఈ వేడుకలో…

నాని ఊచకోత- 100 కోట్ల దసరా
నాని దసరా ర్యాంపేజ్ బాక్సాఫీస్ వద్ద ఇంకా నడుస్తుంది. సినిమా రిలీజ్ అయి వారం రోజులు కావస్తుంది అయినా కూడా ఈసినిమా కలెక్షన్స్ మాత్రం ఆగట్లేదు. ఊచకోత కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించడం, సినిమా సాంగ్స్ బాగుండటం, ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్, అదిరిపోయిన సినిమా క్లైమాక్స్ ఇవన్నీ సినిమాకి ప్లస్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు చిత్రబృందం.

ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతున్న విరూపాక్ష
కార్తీక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది ఈసినిమా. బ్లాక్ మ్యాజిక్ థీమ్ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు తెలుస్తుంది. ఒక ఊరిని వరుస చావులు వెంబడిస్తుంటాయి. ఆ చావులకు గల కారణాలు ఏంటీ అని తెలుసుకోవాడానికి హీరో ఆ ఊరికి వెళ్తాడు. అయితే అక్కడ ఆ హీరోకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అసలు ఆ చావుల వెనుక ఉన్న మిస్టరీ ఎంటీ అనేదే ఈ కథ అన్నట్టు ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి.

ఆదిపురుష్ నుండి హనుమాన్ పోస్టర్ రిలీజ్
ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ నుండి హనుమాన్ పోస్టర్ ను విడుదలచేశారు మేకర్స్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్బంగా ఈపోస్టర్ ను విడుదలచేశారు. వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ ,లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ,హనుమంతుడిగా దేవదత్తా నాగే అలాగే రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈసినిమా నుండి ఇది వరకు విడుదలైన పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ రాగ తాజాగా విడుదలైన హనుమాన్ పోస్టర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. పోస్టర్లో దీక్షలో వున్నా హనుమాన్ గా దేవదత్తా కనిపించిగా బ్యాక్ గ్రౌండ్ లో రాముడిగా ప్రభాస్ కనిపించారు.

20 ఏళ్ల సక్సెఫుల్ జర్నీ
డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. నిజానికి దిల్ రాజు అసలు రేపు వెంకట రమణా రెడ్డి అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు 2003లో నితిన్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ మూవీని తొలిసారిగా నిర్మించారు. నిర్మాతగా ఫస్ట్ సినిమాతోనే తన బ్యానర్ పై మంచి సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆసినిమానే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్ రాజు అయ్యాడు. ఇక అక్కడి నుండి నిర్మాతగా తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దిల్ తర్వాత ఆయన వచ్చిన…

విజువల్ వండర్ గా శాకుంతలం ట్రైలర్
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు గుణశేఖర్. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇంతకు ముందే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా.

శాకుంతలంలో దుష్యంతుడి పాత్ర ఇదే..
గుణశేఖర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం విడుదలకు సిద్దమవుతుంది. ఈసినిమాలో సమంత టైటిల్ రోల్ లో నటించగా దేవ్ మోహన్,దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు.ఈసందర్బంగా దుష్యంతుడి ఎవరు ఆయన చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ ఒక్కటీ అడగొద్దు
క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర'. ఈసినిమా ఏప్రిల్ 7వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు ఆకట్టుకోగా.. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

అశోక్ గల్లా2 యాక్షన్ టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు తనకంటూ స్పెషల్ గా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని టాలీవుడ్ లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కృష్ణ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతను కూడా వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అశోక్ గల్లా. హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అశోక్ మొదటి సినిమాతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు.

సమంత పై ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా తన సినిమాలతో అలరిస్తూ వస్తుంది సమంత. ఇక రీసెంట్ గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకోవడమే కాకుండా సమంత కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం శాకుంతలం సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా రానున్న ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మయోసైటిస్ నుండి కోలుకున్న సమంత ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను సైతం స్టార్ట్ చేసేసింది.

బలగం షోస్ ఆపేదే లేదు
మన తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తాను చాటుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులతో పాటు ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు మరో సినిమా కూడా అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చుకుంది. చాలా చిన్న సినిమాగా అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమా బలగం. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బలగం. తెలంగాణ సంస్కృతి, మానవ సంబంధాలని మనసులకు హత్తుకునేలా భావోద్వేగాలతో నిండిన కథను తీసుకొచ్చి దర్శకుడిగా విజయాన్ని సాధించాడు.

వార్ 2 కి సిద్దమైన హృతిక్, ఎన్టీఆర్
సినీ ఇండస్ట్రీల మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోయాయి. టాలెంట్ ఎక్కడ ఉంటే మేకర్స్ అక్కడికి వెళ్లిపోతున్నారు. అందుకే పయోగాత్మక సినిమాలు ఎన్నో చూస్తున్నాం. అంతేకాదు నటీనటులు కూడా ఒకే భాషకు పరిమితం కాకుండా వేరే భాషల్లో తమ ప్రతిభను చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే మనవాళ్లు హిందీలో అలానే హిందీ నటీ నటులు తెలుగులో నటించడానికి ఏమాత్రం సందేహించడంలేదు. ఇప్పటికే మనవాళ్లు చాలామంది బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఓ పవర్ పుల్ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. ఈ అప్ డేట్ తో…