నరేష్, పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ టీజర్ రిలీజ్ డేట్

naresh and pavitra lokesh starrer malli pelli movie teaser update

ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్లీ పెళ్లి’. తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈసినిమాను విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా విడుదలకు సిద్ధమవుతుండగా చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటివరకూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌, గ్లింప్స్ లో లీడ్ పెయిర్ అందమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక టీజర్ రిలీజ్ కు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా టీజర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. టీజర్ ను ఏప్రిల్ 13న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. నరేష్, విత్ర లోకేష్ చిరునవ్వుతో లవ్ సింబల్స్ చూపిస్తూ కనిపించారు. నరేష్ సూట్ వేసుకోగా, పవిత్ర లోకేష్ చీరలో ఆకట్టుకున్నారు.

కాగా ఇంకా ఈసినిమాలో జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =