ఇండియన్ 2 తైవాన్ షూట్ కంప్లీట్

Indian 2 movie Taiwan schedule wraps up

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా. ఈసినిమా షూటింగ్ ను జూన్ వరకూ కంప్లీట్ చేస్తామని ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ తెలిపిన సంగతి తెలిసిందే. ఆదిశగానే ఇప్పుడు షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ఇక ఒకవైపు రామ్ చరణ్ తో సినిమాను పూర్తి చేస్తూనే మరోపక్క ఇండియన్ 2 సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు మరో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నాడు. తాజాగా ఈసినిమా తైవాన్ లో షూట్ ను పూర్తి చేసుకుంది. ఇక షూట్ ను సౌత్ ఆఫ్రికాలో జరుపుకోనున్నారు. ఇక త్వరలో అక్కడ షూటింగ్ లో ను కూడా మొదలుపెట్టి పూర్తి చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్థ్, గుల్షన్ గ్రోవర్, నెదురుమూడి వేణు, సముద్రఖని, బాబీ సింహ, గురు సోమసుందరం, ఢిల్లీ గణేష్, జయ ప్రకాష్, మారి ముత్తు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు. ఈసినిమాను దీపావళి పండుగ సందర్బంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 9 =