ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ తో తను ఎంత ఫేమస్ అయ్యాడో ఈమధ్య సోషల్ మీడియాలో కూడా పలు వీడియోలతో అంతే ఫేమస్ అయ్యాడు. గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో వార్నర్ చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్ని సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. అలవైకుంఠపురములో మూవీలో ‘రాములో రాములా’, ‘బుట్టబొమ్మ’ పాటలతో మొదలైన ఈ ప్రస్థానం ఆతరువాత పలు హీరోల పాటలకు కూడా తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్.. బాహుబలి సినిమాలో ‘అమరేంద్ర బాహుబలి అనే నేను’ డైలాగ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పక్కాలోకల్ సాంగ్, రౌడీ బేబి సాంగ్ ఇలా పలు పాటలను, డైలగ్ లను రీ క్రియేట్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో పాటలకు వార్నర్ వేసిన స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇదిలా ఉండగా నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా బన్నీకి శుభాకాంక్షలు చెప్పాడు వార్నర్. తన కూతురు ఇస్లా రోజ్ తో కలిసి పుష్ప స్టయిల్ లో విషెస్ తెలియజేస్తూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘బిగ్ స్టార్, బిగ్ మ్యాన్ అల్లు అర్జున్ కు హ్యాపీ బర్త్ డే. పుష్ప2 కోసం మేం వేచి చూస్తున్నాం’ అని తెలిపాడు. పక్కనే ఉన్న ఇస్లా హ్యాపీ బర్త్ డే పుష్ప అని క్యూట్ గా విషెస్ తెలిపింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























