దేశ వ్యాప్తంగా అందరూ వెయిట్ చూస్తున్న సినిమాల్లో పుష్ప2 సినిమా ఒకటి. మొదటి పార్ట్ సంచలన విజయం సాధించడంతో రెండో పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే ఈసినిమా నుండి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. మరోవైపు ఫ్యాన్స్ అప్ డేట్ కోసం ఎప్పటినుండో చూస్తున్నారు. ఈనేపథ్యంలోనే రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఓ వీడియో ను రిలీజ్ చేశారు. వేర్ ఈజ్ పుష్ప అనే క్యాప్షన్ తో రిలీజ్ అయిన ఈవీడియో ఇప్పుడు ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పుష్ప ఎనిమిది బుల్లెట్ల గాయంతో తప్పించుకున్నారని చెప్పగా, పుష్ప చనిపోయి ఉంటాడని, పోలీసులు డ్రామా చేస్తున్నారని, పుష్ప విదేశాలకు పారిపోయి ఉంటాడని మీడియాలో కథనాలు వస్తుంటాయి. ఇంతలో దొరికిన ఓ కెమెరా రికార్డింగ్ వీడియోలో పుష్ప కనిపించడంతో జనం సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏకంగా పుష్ప రంగంలోకి దిగి ఇది పుష్ప రూలు అంటూ చెప్పడంతో వీడియో అదిరిపోయింది.
ఇక ఇప్పుడు మరోలుక్ రిలీజ్ అయి ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. . ఇందులో బన్నీ ఏకంగా అమ్మోరు అవతారంలో కనిపిస్తున్నారు. ముఖానికి రంగులు పూసుకుని, ముక్కు పుడక, మెడలో బత్తాయి కాయల దండ, పులదండ, నగల హారాలు ధరించి చీరకట్టుకుని కండలు తిరిగిన దేహంతో, చేతిలో తుపాకి పట్టుకుని కోపంతో కనిపిస్తున్నాడు బన్నీ. ఇందులో ఆయన లుక్ పూర్తి భిన్నంగా ఉండటమే కాదు, నెవర్ బిఫోర్ అనేలా ఉండటం విశేషం.
#Pushpa2TheRule Begins!!! pic.twitter.com/FH3ccxGHb8
— Allu Arjun (@alluarjun) April 7, 2023
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: