న్యాచురల్ స్టార్ నాని దసరాతో తనలోని ఊర మాస్ యాంగిల్ ను చూపించాడు. డెబ్యూ సినిమా అయినా కూడా శ్రీకాంత్ ఓదెల చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ లాగానే తన మేకింగ్ తో ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు. నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించడం, సినిమా సాంగ్స్ బాగుండటం, ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్, అదిరిపోయిన సినిమా క్లైమాక్స్ ఇవన్నీ సినిమాకి ప్లస్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. ఈసినిమా కలెక్షన్స్ మాత్రం ఆగట్లేదు. ఊచకోత కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. ఇక ఇక్కడ మాత్రమే కాదు ఈసినిమా యూఎస్ లో కూడా తన హవా చూపిస్తుంది దసరా. 2 మిలియన్ డాలర్స్ క్లబ్ లో దసరా చేరుతుంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా 1.9 మిలియన్ మార్క్ కి వచ్చేసింది. అంటే ఇక 2 మిలియన్ కి ఎంతో దూరంలో లేదని చెప్పాలి. మరో రెండు మూడు రోజుల్లో ఆమార్క్ ను దాటేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: