మాస్ మాహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసురకు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నిన్న మంచి అంచనాల మధ్య విడుదలైన ఈసినిమాకు మౌత్ టాక్ బాగుండడంతో తొలిరోజు 9కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రవితేజ నటన సినిమాకు మెయిన్ హైలైట్ అయ్యింది.ముఖ్యంగా నెగిటివ్ షేడ్ లో రవితేజ యాక్టింగ్ కు ఫ్యాన్స్ తోపాటు మిగితా ప్రేక్షకులు థ్రిల్ అవుతున్నారు.రవితేజ యాక్టింగ్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్,విజువల్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి. ఇక ఈసినిమా విజయంతో రవితేజ హ్యాట్రిక్ కొట్టాడు.గత ఏడాది చివర్లో ధమాకాతో 100కోట్ల క్లబ్ లో చేరిన రవితేజ ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో వచ్చి ఏకంగా 200కోట్ల క్లబ్ లో చేరి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టగా తాజాగా రావణాసురతో వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈసినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్,భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా అభిషేక్ నామ,రవితేజ సంయుక్తంగా నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం టైగర్ నాగేశ్వరావు అనే బయోపిక్ లో నటిస్తున్న రవితేజ.. ఈసినిమా తరువాత పలు సినిమాలను లైన్లో పెట్టాడు.అందులోభాగంగా మినిమం గ్యారెంటీ డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా ఉండనుంది.ఇటీవల ఈవిషయాన్ని హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.త్వరలోనే ఈసినిమాకు సంబందించిన వివరాలు వెలుబడనున్నాయి.
ఈసినిమా హరీష్ శంకర్,రవితేజల కాంబినేషన్లో మూడోది గా రానుంది.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన షాక్ విమర్శకుల ప్రశంసలు అందుకోగా మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. మరి ఈమూడో సినిమా వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: