పుష్ప2 ఫస్ట్ లుక్ రికార్డ్

pushpa 2 first look poster create new records

పుష్ప 2 అంటూ అలా వచ్చాడో లేదో అప్పుడే రికార్డులు మొదలుపెట్టేశాడు బన్నీ. పుష్ప సినిమా మొదలైనప్పుడు అప్పట్లో కూడా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసి రికార్డులు క్రియేట్ చేశాడు బన్నీ. ఇక రిలీజ్ అయిన తరువాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక నేడు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా అప్ డేట్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. నిన్ననే ఈసినిమా నుండి వేర్ ఈజ్ పుష్ప అంటూ ఒక వీడియోను అలానే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రెండు అప్ డేట్లకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ‘పుష్ప ఎక్కడ?’ అంటూ యూనిట్ విడుదల చేసిన వీడియో ఫుల్ వ్యూస్ తో వైరల్ అవుతుంది. తొలి భాగంలో చూపించిన దానికి పూర్తి భిన్నంగా ఈ పార్ట్ 2 ఉంటుందని అర్థమవుతుంది. పుష్ప లో కూలీ నుండి సిండికేట్ వరకూ ఎదిగిన విధానం చూపించగా.. రెండో భాగంలో ఆయన్ను నాయకుడిని చేశారు. స్మగ్లింగ్ చేసి సంపాదించిన డబ్బుతో పేదలకు ఓ దారి చూపించడం మాత్రమే కాదు… వాళ్ళ పిల్లలకు విద్య, అవసరమైన వాళ్ళకు సహాయం చేయడం చూపించారు. ఈవీడియోకు అయితే సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఫస్ట్ లుక్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ ఫస్ట్ లుక్ కి అయితే ట్విట్టర్ నుంచి ఆల్ టైం రికార్డు రెస్పాన్స్ ని బన్నీ సొంతం చేసుకున్నాడు. 24 గంటలు కూడా పూర్తి కాకుండానే కాకుండానే 1 లక్ష 50 వేలకి పైగా లైక్స్ అందుకున్న ఫస్ట్ లుక్ గా మాసివ్ రికార్డు క్రియేట్ చేసుకుంది. మరి ఫస్ట్ లుక్ తోనే రికార్డులు మొదలుపెట్టిన పార్ట్ 2.. రిలీజ్ తరువాత ఎన్ని రికార్జులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.