కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బలగం. ఎలాంటి అంచనాలు లేకుండా ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈసినిమా చూసిన తరువాత ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మౌత్ టాక్ తో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించిన జీవనచిత్రంగా ప్రశంసలను అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా వరుసగా అంతర్జాతీయ అవార్డులను కొల్లగొడుతుంది. ఇటీవలే బలగం సినిమా రెండు లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు అందుకుంది. ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకుంది. బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఒనికో ఫిల్మ్ అవార్డు(ఉక్రెయిన్) సొంతం చేసుకుంది. ఆ అవార్డు వచ్చిందో లేదో తాజాగా మరో నాలుగు అవార్డులు బలగం సినిమాకు అందనున్నాయి. అమెరికా వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో నాలుగు కేటగిరీల కింద బలగం సినిమా అవార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్ ఫ్యూచర్ డైరెక్టర్ గా వేణుకు, బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ ఫ్యూచర్ కేటగిరీ కింద హీరో ప్రియదర్శికి.. బెస్ట్ యాక్టరస్ ఇన్ ఏ ఫూచర్ కేటగిరీ కింద హీరోయిన్ కావ్య కల్యాణ్ రాంకు, బెస్ట్ నేరేటివ్ ప్యూచర్ కేటగిరీ లో డైరెక్టర్ వేణుకు ఈ అవార్డ్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు మరో అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఉత్తమ దర్శకుడిగా వేణు అంతర్జాతీయ అవార్డును సాధించాడు. ఆమ్ స్టర్ డామ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నారు.
కాగా ప్రియదర్శి ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈసినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: