తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అయితే తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ కు అలానే రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 16వ తేదీన ఉదయం 9 గంటల 5 నిమిషాలకు ఈసినిమా టైటిల్ ను అలానే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో సూర్య పలు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: