ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సీక్వెల్ .. పుష్ప ది రూల్ నుండి వీడియో రిలీజ్ అయ్యింది. పుష్ప 2 ది రూల్ పేరుతో 3నిమిషాల 15సెకండ్ల రన్ టైం తో ఈవీడియోను కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో పుష్ప ది రూల్ ఎలా వుండబోతుందో చూపించారు. జైలు నుండి తప్పించుకున్న పుష్ప ఎక్కడున్నాడు సమాధానంగా ఈవీడియోను రిలీజ్ చేశారు. జైలు నుండి బుల్లెట్ గాయాలతో పుష్ప తప్పించుకొని శేషాచలం అడవుల్లోకి పారిపోవడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ను మొదలు పెడతారు. అందులో భాగంగా ఓ కొండపై పుష్ప ధరించిన షర్ట్ దొరుకుంది దానికి ఏకంగా 8బుల్లెట్ రంద్రాలు ఉండడంతో పుష్ప చనిపోయి ఉంటాడని వదంతులు వ్యాపిస్తాయి. దాంతో పుష్ప మద్దతు దారులు రోడ్లమీదకు వచ్చి అల్లర్లు చేస్తారు. నెల రోజులైనా ఈ అల్లర్లు చల్లారవు. అయితే స్మగ్లింగ్ చేసే పుష్ప ను ప్రజలు అంతగా సపోర్ట్ చేయడం వెనుక ఆంతర్యాన్ని కూడా వీడియో లో చూపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ అల్లర్లు కొనసాగుతుండగా అడవిలో పులుల జాడ కోసం ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరా లో పులి తో పాటు పుష్ప కనిపిస్తాడు. ఈ సీన్ వీడియోకే హైలైట్ గా నిలిచింది. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కు వేశాయంటే పులి వచ్చిందని అర్ధం… అదే పులే రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం అనే డైలాగ్ గూస్ బమ్స్ తెప్పిస్తుంది. ఆ తరువాత పుష్ప గాడి రూల్ అంటూ అల్లు అర్జున్ డైలాగ్ తో వీడియో ముగుస్తుంది. ఇక ఈవీడియో చూస్తుంటే ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.
మొత్తానికి అప్డేట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప ది రూల్ ను మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
The #HuntForPushpa ends and 𝗣𝗨𝗦𝗛𝗣𝗔'𝗦 𝗥𝗨𝗟𝗘 𝗕𝗘𝗚𝗜𝗡𝗦 🔥
Happy Birthday to Icon Star @alluarjun 🔥 #HappyBirthdayAlluArjun #WhereIsPushpa? #Pushpa2TheRule @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings pic.twitter.com/qxYhHMOGaA
— Mythri Movie Makers (@MythriOfficial) April 7, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: