ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ది రూల్ నుండి విడుదలైన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చిత్తూరులో జరిగే గంగమ్మ జాతరలో అమ్మవారిని పోలిన లుక్ లో వున్న అల్లు అర్జున్ పోస్టర్ ను నిన్న విడుదలచేయగా మాములు రెస్పాన్స్ రావడంలేదు.అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా నిన్న విడుదలైన ఈ పోస్టర్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈపోస్టర్ ను బన్నీ తన సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేయగా..ఇంస్టాగ్రామ్ లో 5M లైక్స్, ట్విట్టర్ లో 207k లైక్స్ అలాగే ఫేస్ బుక్ లో 850k లైక్స్ తో అత్యధిక లైక్స్ పొందిన ఫస్ట్ లుక్ గా రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
PUSHPA RAJ is RULING Social Media 🔥#Pushpa2TheRule is the MOST LIKED FIRST LOOK of all time on FB, Twitter & Insta💥💥
– https://t.co/eNEiADQGP0#HappyBirthdayAlluArjun 💥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/PwqohkLaG6
— Mythri Movie Makers (@MythriOfficial) April 8, 2023
ఇదిలావుంటే నిన్న విడుదలైన వేర్ ఈజ్ ది పుష్ప వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.తెలుగులో కన్నా హిందీలో ఈవీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి యూట్యూబ్ లో 54మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టగా 20లక్షలకు పైగా లైక్స్ తో సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెలుగు వెర్షన్ వీడియో కి ఇప్పటివరకు 2కోట్ల వ్యూస్ రాగ 6.1లక్షల లైక్స్ వచ్చాయి.ఇక హిందీ వెర్షన్ వీడియో 2.8కోట్ల వ్యూస్ ను రాబట్టగా 13లక్షల లైక్స్ వచ్చాయి.ఓవరాల్ గా ఈవీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
ఇక ఫస్ట్ లుక్ అలాగే వీడియో విడుదలచేసి సినిమా పై వున్న అంచనాలను డబుల్ చేయడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్.బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ పుష్పకి కొనసాగింపుగా వస్తున్న ఈచిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ గా రానున్న ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఇక ఈసినిమా…విడుదల తరువాత తెలుగు,హిందీలో కొత్త రికార్డులు సృష్టించేలాగే ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: