వరస విజయాలతో సూపర్ ఫామ్ లో వున్న రవితేజ,రావణాసుర తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. నిన్న మంచి హైప్ తో విడుదలైన ఈచిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.దాంతో ఈసినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 9కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో షేర్ 5కోట్లు.నిన్న పబ్లిక్ హాలిడే కావడం కూడా సినిమాకు కలిసొచ్చింది. ఇక ఈరోజు,రేపు కూడా ఈసినిమా మంచి వసూళ్లను దక్కించుకోనుంది.రవితేజ ఈసినిమాలో నెగిటివ్ షేడ్ లో కనబడి షాక్ ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Ravanasura's arrival has been celebrated in a massive way 🔥
Maharaja's hattrick hit collected a worldwide gross of over 9️⃣ crores+ on its first day 💥
Book your tickets!
– https://t.co/pfL6vWWyhh@RaviTeja_offl @iamSushanthA @sudheerkvarma @AbhishekPicture @itswetha14 pic.twitter.com/CTVS3n0E7h— RT Team Works (@RTTeamWorks) April 8, 2023
రావణాసురను స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేయగా అను ఇమ్మాన్యుయేల్,దక్షా నాగర్కర్,మేఘా ఆకాష్,పూజిత పొన్నాడ,ఫారియా అబ్దుల్లా హీరోయిన్లు గా నటించారు.సుశాంత్,జయరాం,రావు రమేష్, మురళీ శర్మ కీలకపాత్రల్లో కనిపించారు.హర్షవర్ధన్ రామేశ్వర్,భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.అభిషేక్ పిక్చర్స్ ,రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామ,రవితేజ సంయుక్తంగా నిర్మించారు.
ఇక ప్రస్తుతం రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరావు అనే సినిమాను పూర్తి చేసే పనిలో వున్నాడు.ఈసినిమా ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరావు జీవితం ఆధారంగా నూతన డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 20న తెలుగు తోపాటు హిందీ,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో ఈసినిమా ప్రేక్షకులముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: