
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 99


ఎన్టీఆర్ చేతుల మీదుగా 'బింబిసార' ట్రైలర్ రిలీజ్..!

లండన్‌లో పూజా హెగ్డే షాపింగ్ సెల్ఫీ

మలయాళ మూవీ లో ?

'రామారావు ఆన్ డ్యూటీ' నుండి మాస్ నోటీస్..!

ఏ అలవాట్లు లేవు _ అడివి శేష్

హ్యాపీ బర్త్ డే కృతి..!

ధనుష్ 'సార్' ఫస్ట్ లుక్ రిలీజ్-టీజర్ అప్ డేట్..!

సీతారామం కోసం ఎవరు..?


"విక్రాంత్ రోణ" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ..

రజనీ కాంత్ 'జైలర్' షూటింగ్ అప్ డేట్..!

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే చిత్రాలు

'హరిహర వీరమల్లు' పవన్ కోసం కొత్త షెడ్యూల్ ప్లాన్..!

బాబాయి తోనే నా సినీ జర్నీ మొదలైంది..!

అంజలి స్టన్నింగ్ ఫొటో
"ఫొటో" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా తెరకెక్కిన "మాచర్ల నియోజకవర్గం" మూవీ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి ఒక స్పెషల్ మాస్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న "#RC15 " మూవీ లో అంజలి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఎన్టీఆర్ చేతుల మీదుగా 'బింబిసార' ట్రైలర్ రిలీజ్..!
మల్లిడి విశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా బింబిసార. టైమ్ ట్రావెల్ తో హీస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ఇలాంటి జోనర్ లో ఇప్పటివరకూ చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఈసారి కళ్యామ్ రామ్ మాత్రం రొటీన్ కు భిన్నంగా ఈసినిమాతో వస్తున్నాడు. ఈసినిమాపై మొదటి అప్ డేట్ దగ్గరనుండే మంచి అంచనాలు మొదలయ్యాయి. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు కూడా సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి.

లండన్‌లో పూజా హెగ్డే షాపింగ్ సెల్ఫీ
సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో పూజా హెగ్డే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “జనగణమన ” మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.

మలయాళ మూవీ లో ?
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” , “బంగార్రాజు ” మూవీస్ తో కృతి శెట్టి హ్యాట్రిక్ సాధించారు.సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్ల నియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న “#NC 22” మూవీ లో కథానాయికగా కృతి నటిస్తున్నారు. బాలా దర్శకత్వంలో సూర్య , అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో హీరో ధనుష్ నటించే తమిళ మూవీస్ లో కృతి కథానాయికగా ఎంపిక అయ్యారు.

'రామారావు ఆన్ డ్యూటీ' నుండి మాస్ నోటీస్..!
క్రాక్ సినిమాతో మంచి హిట్ ను అందుకొని ఫామ్ లోకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఈసినిమా తరువాత ఇటీవలే ఖిలాడి సినిమాను రిలీజ్ చేశాడు.. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా రవితేజకు నిరాశనే మిగిల్చింది. అయినా కూడా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ఖాతాలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. అందులో త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. జూలై 29 వ తేదీన గ్రాండ్ గా విడుదల అవుతుంది ఈసినిమా.

నటన అంటే ప్రాణం , సినిమా అంటే పిచ్చి - సంయుక్త మీనన్
సూపర్ హిట్ “భీమ్లానాయక్ ” మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ “బింబిసార “, ధనుష్ “సార్” మూవీస్ లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్…

ఏ అలవాట్లు లేవు _ అడివి శేష్
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్న యంగ్ హీరో అడివి శేష్ కథానాయకుడిగా , మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్ ” మూవీ ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.హీరో అడివి శేష్ ప్రస్తుతం సూపర్ హిట్ “HIT:ది ఫస్ట్ కేస్ సీక్వెల్ “HIT 2” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తరువాత అడివి శేష్ హీరోగా సూపర్ హిట్ “గూఢచారి” మూవీ సీక్వెల్ “గూఢచారి 2 ” మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న “గూఢచారి 2” మూవీ గ్రాండ్ లెవెల్లో,అందరి అంచనాలు అందుకునేలా తెరకెక్కనుందనీ అడివి శేష్ చెప్పారు.

హ్యాపీ బర్త్ డే కృతి..!
ప్రభాస్ ప్రస్తుతం పాన్ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఇతిహాసాలలో ఒకటైన రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ మూవి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. కృతీసనన్ సీత పాత్రలో నటిస్తుంది.

ధనుష్ 'సార్' ఫస్ట్ లుక్ రిలీజ్-టీజర్ అప్ డేట్..!
తమిళ్ లో స్టార్ హీరోగా అలరిస్తున్న ధనుష్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్నాడు ధనుష్. అందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా.. మరొకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా. వీటిలో ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. అంతేకాదు.. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో ధనుష్ స్కూల్ టీచర్‌గా నటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి…

సీతారామం కోసం ఎవరు..?
హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సీతారామం. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ ఆకట్టుకోగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అంచనాలను పెంచేసింది. హను రాఘవపూడి మరోో హృదయానికి హత్తుకునే ప్రేమకథతో వస్తున్నాడని అర్థమవుతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించునున్నారు. ఈనేపథ్యంలో దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ లేదా ప్రభాస్ కానీ అతిథులుగా రానున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఒక మల్టీప్లెక్స్ ఛైన్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా"కె జి ఎఫ్ చాప్టర్ 2"
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ నిధి శెట్టి కథానాయిక . రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.అంచనాలకు తగ్గట్టుగా…

"విక్రాంత్ రోణ" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ..
కిచ్చా క్రియేషన్స్ , షాలిని ఆర్ట్స్ , ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్ పై అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ” విక్రాంత్ రోణ”కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. నీతా అశోక్ , జాక్వెలెన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. నిరూప్ భండారి, రవిశంకర్ గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
'భోళా శంకర్' పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకున్నారు. ఇక ఈమధ్య ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవి వార్తలు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రీసెంట్ గానే మళ్లీ ఈసినిమా షూట్ ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతుంది

టాలీవుడ్ నిర్మాతల స్ట్రాంగ్ డెసిషన్.. అప్పటివరకూ షూటింగ్ లు నిలిపివేత..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాలీవుడ్ సినిమాలు మార్కెట్ పరంగా తమ హవాను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యకాలంలో ఏ పరిశ్రమ కూడా టాలీవుడ్ అందుకున్న రేంజ్ లో విజయాలను దక్కించుకోలేకపోయాయి. ఇక మరోవైపు టాలీవుడ్ కు టికెట్ల విషయంలో అలానే ఓటీటీ రిలీజ్ ల విషయంలో కూడా గత కొద్దిరోజులుగా గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. కరోనా ముందు వరకూ ఈ సమస్య తలెత్తలేదు కానీ.. కరోనా తరువాత ఓటీటీల ప్రభావం మరీ ఎక్కువైన తరువాత ఈసమస్య మరీ ఎక్కువైంది. ఇక ఈ ఇష్యూపై గత కొద్దిరోజులుగా చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇటీవలే టాలీవుడ్ నిర్మాతలు టికెట్ల రేట్లపై చర్చలు జరిపి టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు. ఇక ఓటీటీలో కూడా పెద్ద సినిమాలు…

రజనీ కాంత్ 'జైలర్' షూటింగ్ అప్ డేట్..!
లెజెండరీ యాక్టర్ రజనీకాంత్ ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూనే వెళుతున్నారు. నిజానికి రోబో లాంటి సంచలన విజయం తరువాత రజనీకి ఆ రేంజ్ లో హిట్ దక్కలేదు. ఇటీవలే రజనీ కాంత్ అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల అయ్యింది. ఇక్కడ బాగానే ఈసినిమాకు మంచి టాక్ లభించింది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు రజనీకాంత్. విజయ్ తో బీస్ట్ సినిమాను తీసి హిట్ కొట్టిన నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ తన కొత్త సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. జైలర్ అనే టైటిల్ ను…

మంగ్లీ బోనం పాటకు సూపర్ రెస్పాన్స్..!
సినీ ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. కొంతమందికి అనుకోని విధంగా లక్ కలిసొస్తుంది. అలాంటి వారిలో మంగ్లీ కూడా ఒకరు. మంగ్లీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తీన్మార్ వార్తలతో టీవీ ప్రేక్షకులకు పరిచయమై మంగ్లీ తన కామెడీ టైమింగ్ తో నవ్వించేది.. ఆ తర్వాత 'బతుకమ్మ' పాటలతో.. ఆ తర్వాత సినిమాల్లో పాడే అవకాశం దక్కించుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది మంగ్లీ. ఈమధ్య కాలంలో తను పాడిన పాటలు ఊ అంటవా కన్నడ వెర్షన్, రాములో రాములా, సారంగ దరియా పాటలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఇక రీసెంట్ గా వచ్చిన విక్రాంత్ రోణ లోని రారా రక్కమ్మ అనే పాట అయితే సోషల్ మీడియాలో…

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే చిత్రాలు
కిచ్చా క్రియేషన్స్ , షాలిని ఆర్ట్స్ , ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్ పై అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ " విక్రాంత్ రోణ"కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. నీతా అశోక్ , జాక్వెలెన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. నిరూప్ భండారి, రవిశంకర్ గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'హరిహర వీరమల్లు' పవన్ కోసం కొత్త షెడ్యూల్ ప్లాన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల కాలం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాకు మాత్రం బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఈసినిమా కంటే వెనుక మొదలైన వకీల్ సాబ్ సినిమానే ముందు షూటింగ్ ను పూర్తిచేసుకుంది.. రిలీజ్ కూడా అయి చాలా కాలమైంది. కానీ ఈసినిమాకు మాత్రం ఇంకా విముక్తి కలగలేదు. ఈసినిమాను రీస్టార్ట్ చేయడమే చాలా లేటుగా చేశారు. ఫైనల్ గా ఇటీవలే మొదలుపెట్టారు ఇక మొత్తం షూటింగ్ కంప్లీట్ చేస్తారులే అనుకుంటే మళ్లీ గ్యాప్ ఇచ్చారు. మరోవైపు పవన్ కూడా రాజకీయాలతో బిజీ అవ్వడం ఈసినిమా షూటింగ్ కు మైనస్ అవుతుంది.

బాబాయి తోనే నా సినీ జర్నీ మొదలైంది..!
ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాలు, యాక్షన్ ఎంటర్ టైనర్ లతో ప్రేక్షకులను అలరించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు మొదటిసారి కెరీర్ లోనే డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. బింబిసార అనే సోషియో ఫాంటసీ సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.. ఈనెల 29వ తేదీన ఈసినిమా ప్రీరిలీజ్ ను నిర్వహించనున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రానున్నారు.

"ఖుషి" మూవీ లో సోలో సాంగ్ చిత్రీకరణ లో విజయ్ దేవరకొండ
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఖుషి”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.