ధనుష్ ‘సార్’ ఫస్ట్ లుక్ రిలీజ్-టీజర్ అప్ డేట్..!

Sir Movie First Look & Teaser Update Out,Sir Telugu Movie First Look Out And Teaser Date Locked,Sir Movie Teaser Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sir,Sir Movie,Sir Telugu Movie,Sir Movie latest Updates,Sir New Movie Updates,Sir Teaser Release Date Locked,Sir Movie Teaser,Sir Telugu Movie Teaser, Sir Movie Teaser Release Date Fixed,Dhanush,Hero Dhanush,Kollywood Star Hero Dhanush,Dhanush Upcoming Movie Sir Movie Teaser Released,Dhanush Movie Sir, Dhanush Sir Movie Teaser,Dhanush New Movie Updates,Dhanush New Movie updates

తమిళ్ లో స్టార్ హీరోగా అలరిస్తున్న ధనుష్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్నాడు ధనుష్. అందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా.. మరొకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా. వీటిలో ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. అంతేకాదు.. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో ధనుష్ స్కూల్ టీచర్‌గా నటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చాలా రోజుల నుంచి అభిమానులు ఈ సినిమా నుండి అప్ డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా.. రేపు ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి ఒకరోజు ముందే ట్రీట్ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీనితో పాటు టీజర్ అప్ డేట్ కూడా ఇచ్చారు. ఈసినిమా టీజర్ ను రేపు అంటే జులై 28వ తేదీన సాయంత్రం 6గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా.. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సాయికుమార్,తనికెళ్ల భ‌ర‌ణి
, నర్రాశ్రీను కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్ర‌కాష్‌కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేయనున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =