రజనీ కాంత్ ‘జైలర్’ షూటింగ్ అప్ డేట్..!

Rajinikanth Jailer Movie Shooting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jailer,Jailer Movie,Jailer Telugu Movie,Jailer Movie latest Updates,Jailer Movie Latest Shooting Updates,Jailer Telugu Movie Shooting Updates,Rajinikanth Jailer Movie, Super Star Rajinikanth,Rajinikanth,Rajinikanth Movie Shooting Updates,Rajinikanth Upcoming Movie Jailer Shooting Updates,Rajinikanth Jailer Telugu Movie Shooting Updates, Rajinikanth Jailer Movie Update,Thalaivar 169 Movie Shooting Update,Nelson Dilipkumar Jailer Movie Updates,Rajinikanth and Nelson Dilipkumar,Rajinikanth and Nelson Dilipkumar Jailer Movie Updates Today

లెజెండరీ యాక్టర్ రజనీకాంత్ ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూనే వెళుతున్నారు. నిజానికి రోబో లాంటి సంచలన విజయం తరువాత రజనీకి ఆ రేంజ్ లో హిట్ దక్కలేదు. ఇటీవలే రజనీ కాంత్ అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల అయ్యింది. ఇక్కడ బాగానే ఈసినిమాకు మంచి టాక్ లభించింది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు రజనీకాంత్. విజయ్ తో బీస్ట్ సినిమాను తీసి హిట్ కొట్టిన నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ తన కొత్త సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. జైలర్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఖరారు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ కోసం రజనీ మళ్లీ హైద్రాబాద్ రానున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా కోసం హైద్రాబాద్ లో ప్రత్యేక సెట్ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రత్యేక సెట్ లో జైలర్ ఇంట్రడక్షన్ సీన్లు చిత్రీకరించనున్నారట. అంతేకాదు ఈషూటింగ్ లో రజనీకాంత్ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

కాగా రోబో సినిమాలో రజనీకి జోడీగా నటించిన ఐశ్వర్యరాయ్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఈసినిమాలో ర‌మ్య కృష్ణ‌, ప్రియాంక అరుళ్ మోహ‌న్‌, శివ‌రాజ్‌కుమార్ వంటి అగ్ర తార‌లు న‌టించ‌నున్న‌ట్లు టాక్. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =